Viral Video: Shah Rukh Khan pushes a fan from clicking selfie at the airport - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: ఇలాంటి వారితో సెల్ఫీ తీసుకోవద్దు.. షారుక్‌ ఖాన్‌పై నెటిజన్స్ ఫైర్!

Published Wed, May 3 2023 3:55 PM | Last Updated on Wed, May 3 2023 4:36 PM

Shah Rukh Khan Loss Control At Airport To Push A Fan clicking A Selfie - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవలే పఠాన్‌ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే కూడా నటించారు. గతేడాది విడుదలైన పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్‌లో నటిస్తున్నారు.

(ఇది చదవండి: నాలుగు రోజుల్లో 500కు పైగా సిగరెట్లు తాగాను: అల్లరి నరేశ్‌)

తాజాగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంటికి చిక్కారు షారూక్. దీంతో అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించారు. దీంతో షారూక్ సహనం కోల్పోయాడు. ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేస్తూ అభిమాని చేతిని దూరంగా నెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు షారూక్ తీరుపై మండి పడుతున్నారు. 

ఓ నెటిజన్ రాస్తూ..' సెల్ఫీలు తీసుకోవాల్సింది ఇలాంటి వారితో కాదు. దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ, మనదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న వారితో దిగండి అంటూ సలహాలిచ్చారు. మరొక నెటిజన్ రాస్తూ..' మీ పర్మిషన్ లేకుండా మీతో సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. మరోవైపు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న డుంకీలో కూడా కనిపించనున్నారు. 

(ఇది చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్‌-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement