ఇచ్ఛాపురం రూరల్: ఎవరో చేసిన పనులను తాము చేసినట్టుగా చెప్పుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా ఈ విషయంలో అధినేతను అనుసరిస్తున్నారు. టీడీపీయేతర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులను తాము చేసినట్టుగా చెప్పుకొంటూ సెల్ఫీ చాలెంజ్‌లు చేస్తూ జనంలో నవ్వులపాలవుతున్నారు. ‘2018లో అప్ప టి సీఎం చంద్రబాబు హయాంలో బొడ్డబడలో రూ.7 కోట్లతో రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణం చేశాం.
ఈ క్రమంలో చాలెంజ్ చేస్తున్నా.. వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరైనా సవాల్‌ను స్వీకరించాలి’ అంటూ మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ వంతెన దిగువన ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ విసిరిన సెల్ఫీతో సవాల్ ఎల్లో మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో రావడంతో బొడ్డబడ గ్రామస్తు లు అవాక్కయ్యారు. సొమ్మొకడిది.. సోకొకడిది.. అన్న చందంగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల తీరుపై వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి వంతెన నిర్మించాలంటూ టీడీపీ హయాంలో వందలాది వినతి పత్రాలిచ్చినా బుట్టదాఖలు చేశారని గుర్తుచేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి చొరవతో 2014లో రూ.7 కోట్ల కేంద్ర నిధులతో వంతెన పనులకు ప్రారంభోత్సవం చేసి.. నిర్మాణాన్ని మొదలు పెట్టారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరి్మంచిన ఆ వంతెనను 2018 మే 18న టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన అనంతరం ఎన్నో ఏళ్ల తమ కల నెరవేర్చినందుకు గ్రామస్తులు డాక్టర్ కిల్లి కృపారాణికి సన్మానం కూడా చేశారు. ఎవరో నిరి్మంచిన బ్రిడ్జికి ప్రారంబోత్సవం చేసి.. ఇది తామే కట్టామంటూ టీడీపీ నేతలు సెల్ఫీ చాలెంజ్‌లు విసరడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అవునులే ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా! చంద్రబాబుదీ ఇదే తంతు కదా!.
Comments
Please login to add a commentAdd a comment