
Naga Chaitanya Selfie With His Fans In Goa Post Goes Viral: అక్కినేని నాగ చైతన్య. సినీ ఇండస్ట్రీలోని ప‍్రముఖ రెండు కుటుంబాల వారసుడు. కానీ ఎప్పుడూ గొప్పగా మాట్లడటం, గర్వం కనిపించవు. చూడటానికి ఉండటానికి సాప్ట్ క్యారెక్టర్. ఎదిగేకొద్దీ ఒదుగుతూ ఉండే మనస్తత్వం చైతూది. కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వాళ్లు అందరూ నాగ చైతన‍్య గురించి చెప్పే విషయం డౌన్ టూ ఎర్త్ ఉంటాడని. అయితే ఇంతటి మంచి లక్షణాలున్న చైతన్య మంచితనం గురించి తాజాగా ఒక పోస్ట్ చెబుతుంది.
అదేంటంటే.. ఇద్దరు దంపతులు (నవీన్ శర్మ, శిరీష) గోవాలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. అక్కడికి చైతన్య కూడా వచ్చాడు. అది చూసిన దంపతులు మొదటగా అతను నాగ చైతన్య కాదో అవునో అని తటపటాయించారు. నాగ చైతన్య వద్దకు వెళుతూ చూస్తు సందిగ్ధంలో ఉన్నారు. అయితే చివరిగా అది నాగచైతన్యే అని ధ్రువీకరించుకొని చైతూను సెల్ఫీ ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు సరే అన్నా నాగ చైతన్యతో వారు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఫ్రేమ్‌లో ఇద్దరూ దంపతులు సరిగా కనిపించకపోవడాన్ని గమనించాడు నాగ చైతన్య. దీంతో 'నేను సెల‍్ఫీ తీస్తాను. అప్పుడు ఫొటోలో మీరు ఇద్దరు కనిపిస్తారు' అని చైతూనే ఫోన్ తీసుకుని ఫ్రేమ్‌లో ముగ్గురు వచ్చేలా సెల్ఫీ తీసి ఇచ్చాడు.
ఇది చూసిన ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చైతూ మంచితనం గురించి విన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం. నిజంగా చైతన్య డౌన్ టూ ఎర్త్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ జంట. ఈ జరిగిన మొత్తం విషయాన్ని ఇన్‌స్టాలో ఎమోషనల్ హర్ట్ టచింగ్‌తో పంచుకున్నారు. 'నాగ చైతన్య డౌన్ టూ ఎర్త్ బిహేవియర్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అతనితో సెల్ఫీ దిగడం మెమరబుల్ మూమెంట్' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: చిన్నారి నోట సమంత పాట.. సామ్, డీఎస్పీ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment