
సాక్షి, శ్రీసత్యసాయి: చంద్రబాబు నాయుడికి.. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. వయసు మీద పడే కొద్దీ.. అధికార దాహం పెరిగిపోతోంది ఆయనలో. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదనే అసహనమూ ఆయనలో కొట్టొచ్చినట్లూ కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే.. తాజాగా ఆయన చేసిన స్టంట్ నవ్వులు పూయిస్తోంది.
పెనుగొండ పర్యటనలో కియా కార్ల పరిశ్రమ ఎదురుగా సెల్ఫీ దిగి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాననుకున్నారాయన. దానికి యెల్లో మీడియా ఈనాడు తన కథనంలో ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఉద్యోగులతో పాపం బలవంతంగా తన బావ పాటకు(జై బాలయ్య..) డాన్స్ చేయించిన ఉదంతాన్ని సైతం చంద్రబాబు తన ప్రసంగంలో ఉదహరించాడు.
అయితే.. సెల్ఫీ కోసం చంద్రబాబు నాయుడు అవస్థలు పడ్డాడు. అది తీయటం రాక మూడు సెల్ ఫోన్లు మార్చారు. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది సహకరించారు. ఇంకేం.. ఆ ముసలాయన తాను అనుకున్న పని చేసేశాడు. ఇదే కాదు.. తన మీటింగ్‌లకు జనాలు వచ్చారని చూపించుకునేందుకు ఆయన చేసే ప్రయత్నమూ(డ్రోన్ కెమెరా) కనిపించిందక్కడ. గతంలో ఇలాంటి అత్యుత్సాహమే కదా అమాయక ప్రాణాల్ని బలిగొంది. అయినా చంద్రబాబుకు సిగ్గుమాత్రం రావడం లేదు! అనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment