స్క్రీన్ టెస్ట్
1. ఆగస్ట్ 15న పుట్టిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా?
ఎ) బ్రహ్మాజీ బి) శ్రీహరి సి) నరేశ్ డి) రావు రమేశ్
2. కమల్‌హాసన్ నటించిన ‘విశ్వరూపం 1, 2’లలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో కనుక్కోండి?
ఎ) మల్లికా శెరావత్ బి) జయప్రద సి) అసిన్ డి) పూజాకుమార్
3 . సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సుప్రీం’ చిత్రంలో బెల్లం శ్రీదేవి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) రాశీ ఖన్నా బి) రెజీనా సి) రకుల్‌ప్రీత్ సింగ్ డి) లావణ్య త్రిపాఠి
4. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ఈ ఆగస్టుకు ఆయన ఎన్నో సంవత్సరంలోకి అడుగు పెడతారో తెలుసా?
ఎ) 61 బి) 60 సి) 62 డి) 64
5. నాగార్జున, నానీ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి దర్శకుడెవరో చూద్దామా?
ఎ) శ్రీరామ్ ఆదిత్య బి) ప్రశాంత్ వర్మ సి) విరించి వర్మ డి) తరుణ్ భాస్కర్
6. ‘చి.ల.సౌ’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన హీరోయిన్ పేరేంటి?
ఎ) శోభిత దూళిపాళ్ల బి) రుహానీ శర్మ సి) సిమ్రన్ డి) కష్మీరి
7. ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో నటించారు ‘దుల్కర్ సల్మాన్’. ఆ సినిమాలో ఆయన మొదటి భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా?
ఎ) నందితా శ్వేత బి) మెహరీన్ సి) మాళవికా నాయర్ డి) నిత్యా మీనన్
8. మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఆ చిత్రదర్శకుడు మహీ.వి.రాఘవ్ ఇటీవల తెరకెక్కించిన హిట్ సినిమా పేరేంటి?
ఎ) జయమ్ము నిశ్చయమ్మురా బి) జంబలకిడి పంబ సి) అమీ తుమీ డి) ఆనందో బ్రహ్మ
9. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో 2.0’లో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడెవరో కనుక్కోండి?
ఎ) అజయ్ దేవ్గన్ బి) అక్షయ్ కుమార్ సి) రాజ్‌కుమార్ రావు డి) జాకీ ష్రాఫ్
10. రేవతి, మోహన్ జంటగా నటించిన ‘మౌన రాగం’ చిత్రదర్శకుడెవరో గుర్తు చేసుకుందామా?
ఎ) భారతీరాజా బి) భాగ్యరాజా సి) మణిరత్నం డి) బాలచందర్
11 దర్శకులు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి?
ఎ) జయసుధ బి) జయప్రద సి) విజయశాంతి డి) విజయనిర్మల
12. ‘పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా...’ అనే పాటను పాడిన గాయకుడెవరో తెలుసా?
ఎ) నిహాల్ బి) వేణు సి) మల్లిఖార్జున్ డి) అనూజ్
13. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో ఎక్కువ సినిమాలకు పని చేసిన కెమెరామెన్ ఎవరో తెలుసా?
ఎ) రత్నవేలు బి) కేకే సెంథిల్ కుమార్ సి) రసూల్ ఎల్లోర్ డి) హరి అనుమోలు
14. ‘మనసుకు నచ్చింది’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన టాప్ హీరో ఎవరు?
ఎ) ఎన్టీఆర్ బి) ప్రభాస్ సి) మహేశ్‌బాబు డి) వెంకటేశ్
15. రీసెంట్ తెలుగు హిట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్‌లో నటిస్తున్న హీరో ఎవరు?
ఎ) ఆది సాయికుమార్ బి) ఆది పినిశెట్టి సి) అడివి శేష్ డి) రాహుల్ రవీంద్రన్
16. దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న కథానాయిక ఎవరు?
ఎ) త్రిష బి) హన్సిక సి) ఇలియానా డి) శ్రుతీహాసన్
17. ‘గీత గోవిందం’ చిత్రంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి...’ అనే పాపులర్ సాంగ్‌ను రచించిన రచయితఎవరు?
ఎ) శ్రీమణి
బి) అనంత శ్రీరామ్ సి) వరికుప్పల యాదగిరి డి) రాంబాబు గోసాల
18. ‘ప్రస్థానం’ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించారు సాయికుమార్. హిందీ రీమేక్‌లో ఆ పాత్రను చేస్తున్న నటుడెవరు?
ఎ) అనిల్ కపూర్ బి) సంజయ్ దత్ సి) నానా పటేకర్ డి) నవాజుద్దీన్ సిధ్ధిఖి
19. అక్కినేని, జమున జంటగా నటించిన ఈ స్టిల్ ఏ చిత్రంలోనిదో తెలుసా?
ఎ) గుండమ్మకథ బి) దొంగరాముడు సి) ఇద్దరు మిత్రులు డి) చదువుకున్న అమ్మాయిలు
20. ‘మక్కళ్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని స్థాపించిన తమిళ హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) రజనీకాంత్ బి) శరత్‌కుమార్ సి) కమల్ హాసన్ డి) విజయ్‌కాంత్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) బి 2) డి 3) ఎ 4) డి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) సి 11) ఎ
12) డి 13) బి 14) సి 15) బి 16) సి 17) బి 18) బి 19) బి 20) సి
నిర్వహణ: శివ మల్లాల