న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆన్‌లైన్ పాఠాలకు డిమాండ్ పెరిగిపోయింది. అటు స్కూలు పిల్లలు దగ్గర్నుంచి, ఇటు క్రీడాకారుల వరకూ అంతా ఆన్‌లైన్‌లో తమ ట్రైనింగ్ క్లాస్‌ను వింటున్నారు. ఇలా ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించడానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ( సాయ్), భారత బ్యాడ్మింటన్ అసోసియన్(బాయ్)లు నడుంబిగించగా మధ్యలో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే.. బాయ్, సాయ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ ఆన్‌లైన్ శిక్షణలో 500 నుంచి 700 వరకూ పాల్గొన్నారు. ఇది బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగుతోంది. దీనికి ఇండోనేసియా కోచ్‌లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో మార్గ నిర్దేశకం చేస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న వేళ.. ఒక్కసారిగా స్క్రీన్‌పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్ సాంటోసో క్లాస్ చెబుతున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
సెషన్‌లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న గోపీచంద్ వెంటనే లాగౌట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాయ్’ ఐటీ వింగ్ విచారణ జరుపుతోంది. ఆన్‌లైన్ క్లాస్‌లు జరుగుతున్న సమయంలో అశ్లీల చిత్రాలు రావడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. తమ జూమ్ సెషన్ హ్యాక్ కాకపోయినా అశ్లీల చిత్రాలు రావడం సాయ్ ఐటీ డిపార్ట్‌మెంట్‌కు తలపోటుగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment