
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. గత పర్యటనలో కూడా అమిత్ షా.. సినీ నటులతో సమావేశమయ్యారు.
కాగా, అమిత్ షా పర్యటన సందర్భంగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఆయనను కలిశారు. వీరి భేటీ అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ.. క్రీడలకు కేంద్రం సహకారంపైనే అమిత్ షాతో చర్చించాను. అమిత్ షాతో రాజకీయం అంశాలు చర్చకు రాలేదు. క్రీడాకారులకు వర్తించే కేంద్ర పథకాలపైనే చర్చించినట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ షా పలువురిని కలిశారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను కలిసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: టాలీవుడ్ హీరోలతో బీజేపీ అగ్ర నేతల భేటీలు.. అందుకేనా?