నార్పల : వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి వెళ్లి స్టాటర్ బాక్స్ తెరుస్తుడంగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతి చెందిన సంఘటన నార్పల మండలం పూలసలనూతల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. నార్పల మండలంలోని పులసలనూతల గ్రామానికి చెందిన కురుబ గడ్డం చిన్న వెంకట్రాముడు కు ఇద్దరు కుమారులు. వారిలో సాయి(20) పెద్ద కుమారుడు, ఇంటర్ వరకూ చదువుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉన్నారు. వీరికి మూడు ఎకరాలు పొలం ఉంది. బోరు కింద వేరుశనగ పంటను సాగు చేశారు. వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి తండ్రి, కొడుకు సాయంత్రం ఐదు గంటలకు తోట వద్దకు వెళ్లారు.
ఆరు గంటల సమయంలో త్రీ ఫేస్ కరెంట్ రావడంతో మోటారు ఆన్‌చేయడానికీ స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే స్టాటర్‌కు విద్యుత్ ప్రసరించడంతో సాయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న తండ్రి చిన్న వెంకట్రాముడు టవాల్‌తో కొడుకును లాగడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విద్యుదాఘాతంతో అక్కడక్కడే మృతి చెందాడు. కన్న కొడుకును కళ్లారా చంపుకున్నానని తండ్రి చిన్న వెంకట్రాముడు, కుటుంబ సభ్యులు బోరును విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
Published Sun, Jul 9 2017 11:26 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement