పాజిటివ్‌ ఎనర్జీ ఇచ్చారు Trivikram release on new movie trailer | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌ ఎనర్జీ ఇచ్చారు

Published Wed, Nov 21 2018 12:31 AM

Trivikram release on new movie trailer - Sakshi

శ్రీనివాస్‌సాయి, ప్రియ వడ్లమాని, దీక్ష శర్మ రైనా, ఇర్ఫాన్, సింధు, తిరువీర్, వంశీరాజ్, మోనాబేద్రె, అప్పాజి అంబరీష ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్‌ నర్వాడే దర్శకత్వంలో విద్యాసాగర్,జనార్ధన్‌ ఆర్‌.ఆర్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదలవుతోంది. పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమా రెండో ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది.

పోస్టర్, టీజర్, థియేట్రికల్‌ ట్రైలర్‌ విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ మా చిత్రంపై ఆసక్తి  నెలకొంది. ట్రైలర్, టీజర్‌ చూసిన ఇండస్ట్రీలోని పెద్దలు మా యూనిట్‌కి పాజి టివ్‌ ఎనర్జీని అందిస్తున్నారు. ఇంతమంది ప్రముఖుల ఆదరణ మా సినిమాకి లభించడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.యం.రాధాకృష్ణన్, కెమెరా: యస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌: సూర్యనారాయణ కరుటూరి.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement