
ప్రత్యక్ష దైవం...
మచ్చ రామలింగారెడ్డి సాయిబాబాగా నటిస్తున్న చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. కొండవీటి సత్యం దర్శకుడు. సుకుమార్, కోసూరి సుబ్బారావు నిర్మాతలు. భానుశంకర్, సీత, విజేత, శ్రీకృష్ణ రమేశ్‌లు ప్రధాన పాత్రల్లో నటిసున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ షిర్డీ సాయి మీద వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ చిత్రం. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు.
ఆడియో విడుదలైన తర్వాత కిషన్ కవాడియా స్వరాలు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తాయి. నటీనటుల అభినయం భక్తి పారవశ్యంలోకి తీసుకువెళ్తుంది. పెన్నా, అనంతపురం, అహోబిలం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: దాసం వెంకట్రావ్, ఛాయాగ్రహణం: సూర్య, సంగీతం: కిషన్ కవాడియా.