పోలీసుల వేధింపులు: యువకుడి ఆత‍్మహత‍్య
Published Thu, Feb 23 2017 2:05 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
ములకలపల్లి: తాను చేయని దొంగతనం కేసులో విచారణ నిమిత‍్తం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ‍్లి విచారణ చేయడంతో అవమానంగా భావించిన ఓ యువకుడు యువకుడు ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత‍్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గొల‍్లగూడెం గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన జమ్మిలి సాయి(23) అనే యువకునిపై దొంగతనం చేశాడని ఫిర్యాదు వచ్చింది. అయితేఉ తాను దొంగతనం చేయలేదని చెప్పినా.. పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వారి పద‍్దతిలో విచారణ చేశారు. దాంతో మనస్థాపానికి గురైన సాయి గురువారం ఉదయం ఇంట‍్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. అయితే పోలీసుల వేధింపులతోనే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
Advertisement
Advertisement