ప్రాణాలు తీసిన అతివేగం | Car Accident at Rayinigudem near Suryapet | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన అతివేగం

Apr 12 2024 4:49 AM | Updated on Apr 12 2024 4:49 AM

Car Accident at Rayinigudem near Suryapet - Sakshi

చెట్టును ఢీకొట్టిన కారు

అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి 

మరో ముగ్గురికి స్వల్ప గాయాలు 

సూర్యాపేట సమీపంలోని రాయినిగూడెం వద్ద ప్రమాదం

సూర్యాపేట: అతివేగం ఇద్దరి యువకుల ప్రా­ణాలను బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడు­గురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడి­కక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువ­కు­లకి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఎర్టిగా కారును అద్దెకు తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్‌ను కలిసేందుకు గురువారం వచ్చారు. వీరంతా బాల్యస్నేహితులు.

అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్‌ను కూడా కారులో ఎక్కించుకుని కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం శివారులో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జటంగి సాయి (17), అంతటి నవీన్‌ (20) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మారగోని మహేష్, కావడి శివ, అబ్బురి గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ల ధనుష్‌ అలియాస్‌ బన్ని, ఉదయ్‌ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ధనుష్‌ కారును 170 స్పీడ్‌తో నడపడంతోనే అదుపు తప్పినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టు విరిగిపోవడమే కాకుండా కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement