
తరుణ్ తేజ్, లావణ్య
తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉండి పోరాదే’. సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ కె. లింగేశ్వర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కె .లింగేశ్వర్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. నటీనటులందరూ కొత్తవారే అయినా కథను నమ్మి ఈ సినిమా నిర్మించా. చివరి 20 నిమిషాలు పక్క సీట్లో ఉన్నవారిని కూడా మర్చిపోయేలా మా చిత్రం ఉంటుంది.
ప్రతి ఫ్రేమ్‌ని నవీన్ చక్కగా తెరకెక్కించారు. నటించిన అందరి కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. మా సినిమా 100 శాతం హిట్ అవుతుందనే నమ్మకం మరింత పెరిగింది’’ అన్నారు. ‘‘మేం అనుకున్న దానికన్నా సినిమా మనసుకు హత్తుకునేలా వచ్చింది. ఇంత మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన లింగేశ్వర్‌గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు సాంకేతిక నిపుణులందరూ 100 శాతం కష్టపడ్డారు’’ అన్నారు నవీన్ నాయని.