
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నారని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణల పై హీరో రాజ్ తరుణ్‌స్పందించాడు. తన రిప్యూటేషన్ ఎక్కడా దెబ్బతింటుందో అని ఇన్నాళ్లు బయటికి చెప్పలేదని అన్నారు. అంతే కాకుండా తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌లో లేనని తెలిపారు.
నా ఇంటి నుంచే బయటికి వచ్చేశా..
తాను గుంటూరులో నా ఇంటిలోనే ఉండేదని రాజ్ తరుణ్ వెల్లడించారు. నా సొంతింట్లినే లావణ్య పైన ఉండేదని.. అక్కడ మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసి ఉన్నారని తెలిపారు. తనకు మందు, సిగరెట్ అలవాటు ఉందని.. డ్రగ్స్ నా జీవితంలో ఎప్పుడు తీసుకోలేదని అన్నారు. మస్తాన్ సాయి.. ఆమెను విపరీతంగా కొట్టేవాడని.. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయన్నారు. అతనిపై కేసు పెట్టి కూడా.. నా ఇంట్లోనే మళ్లీ అతనితోనే ఉంటోందని అన్నారు.
ఆమె అలవాట్లు నచ్చక నేను ఇంటి నుంచి బయటికి వచ్చేశానని తెలిపారు. ఒక అమ్మాయికి చెందిన అశ్లీల ఫోటోలు, వీడియోలు పెట్టుకుని వాళ్ల ఫాదర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిందని రాజ్ తరుణ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కేవలం నా ఇమేజ్ దెబ్బతింటుందని పోలీసులకు చెప్పేందుకే బయపడ్డానని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా.. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. లావణ్యకు కూడా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నా ఇంటి కోసమే ఈ రచ్చ అంతా చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఆమెపై కృతజ్ఞత ఉంది.. కానీ..
ఆమెతో రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని.. కానీ అది కేవలం 2014 నుంచి 2017 వరకు మాత్రమేనని రాజ్ తరుణ్ అన్నారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వివరించారు. డ్రగ్స్ తీసుకోవద్దని తనకు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ఆమెతో ఏడేళ్లుగా దూరంగానే ఉంటున్నానని.. ఇప్పటికీ ఆమెపై తనకు కృతజ్ఞత ఉందని.. అందుకే నా ఇంటి నుంచి నేనే బయటికి వచ్చేశానని రాజ్ తరుణ్ వెల్లడించారు.
నాపైనే కాదు... మస్తాన్ సాయిపైనా కేసు పెట్టింది ఇప్పుడు కూడా అతనితోనే...
Raj Tarun Reveled Shocking Facts, Lavanya Relationship With Mastan Sai#rajtarun #rajtaruncase #rajtarunloverlavanya #latestnews #sakshiNews pic.twitter.com/OSEgrah0Ae— Sakshi TV Official (@sakshitvdigital) July 5, 2024