
మరోసారి రాజ్‌తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు
పెళ్లి చేసుకున్నారు.. అబార్షన్ కూడా చేయించారని ఆరోపణ
దీంతో సినీహీరోపై కేసులు నమోదు
మణికొండ/బంజారాహిల్స్: ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర కేసుల తరుణంలో సినీహీరో రాజ్‌తరుణ్ వ్యవహారం సినిమా స్టైల్‌లో అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఇరువర్గాలను పిలిచి నిజానిజాలు నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రాజ్‌తరుణతో 11 ఏళ్ల లివింగ్ రిలేషన్‌లో ఉన్నానని, ఇప్పుడు మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తన వద్దకు రావటంలేదని, మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక్ తనను చంపుతానని బెదిరించాడని ఇదివరకే ఫిర్యాదు చేసిన లావణ్య మంగళవారంరాత్రి నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేసింది.
ముందుగా చేసిన ఫిర్యాదుకు ఆధారాలను చూపాలని పోలీసులు ఆమెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన న్యాయవాదితో కలిసి ఆధారాలను, 175 ఫొటోలు, స్క్రీన్‌చాట్‌లు, వీడియోలు, కాల్ రికార్డ్‌లు అందజేసినట్టు తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌తో తనక 10 ఏళ్ల క్రితమే గచ్చబౌలిలోని ఎల్లమ్మగుడిలో వివాహమైందని, తనకు గర్భం రావటంతో ఓ ఆస్పత్రిలో అబార్షన్ కూడా చేయించారని తెలిపింది.
రాజ్‌తరుణ్‌కు గతంలోనూ మరికొంత మంది మహిళలతో ఎఫైర్‌లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. తాను అని్వక పేరుతో పాస్‌పోర్టు పొందానని, తామిద్దరం కలిసి ఇదివరకు విదేశాలకు కూడా వెళ్లామని తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఆధారాలను పరిశీలించి రాజ్‌తరుణపై కేసులు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. త్వరలోనే రాజ్‌తరుణ్‌ను విచారించి అసలు నిజాలను వెలుగులోకి తెస్తామని పేర్కొన్నారు.
లావణ్యపై మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు
లావణ్య అనవసరంగా వివాదంలోకి లాగి తన పరువుకు భంగం కలిగిస్తోందని, తన సోదరుడికి ఇష్టారాజ్యంగా మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తోందని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనది హిమాచల్‌ప్రదేశ్ అని, తల్లిదండ్రులు అక్కడే ఉంటారని, తాను మాత్రం ముంబైలో ఉంటానని, ‘తిరగబడరా స్వామీ’సినిమాలో నటించానని, ఈ సినిమా నిమిత్తమే హైదరాబాద్‌కు వచ్చి స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నానని వెల్లడించారు. ఫిర్యాదుపై పో లీసులు జీరో ఎఫ్‌ఐర్ నమోదు చేసి ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.