సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేశంపేట తహసీల్దార్ లావణ్య, ఆమె భర్త మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ రీజనల్ డైరెక్టర్ నూనావత్ వెంకటేశ్వర్ నాయక్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. వీరిద్దరూ ఏసీబీ దాడుల్లో వేర్వేరుగా లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వీరి బినామీలైన హయత్‌నగర్‌కు చెందిన బి.నాగమణి, సూర్యాపేట జిల్లా కపూరియా తండాకు చెందిన వి.హుస్సేన్ నాయక్ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు దాదాపుగా రూ.1.33 కోట్ల ఆస్తులను అదనంగా కలిగి ఉన్నారని గుర్తించారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న లావణ్యను మంగళవారం అధికారులు ఏసీబీ ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. భర్త వెంకటేశ్వర్ ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment