assets beyond income
-
తహసీల్దారు దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేశంపేట తహసీల్దార్ లావణ్య, ఆమె భర్త మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ రీజనల్ డైరెక్టర్ నూనావత్ వెంకటేశ్వర్ నాయక్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. వీరిద్దరూ ఏసీబీ దాడుల్లో వేర్వేరుగా లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వీరి బినామీలైన హయత్‌నగర్‌కు చెందిన బి.నాగమణి, సూర్యాపేట జిల్లా కపూరియా తండాకు చెందిన వి.హుస్సేన్ నాయక్ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు దాదాపుగా రూ.1.33 కోట్ల ఆస్తులను అదనంగా కలిగి ఉన్నారని గుర్తించారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న లావణ్యను మంగళవారం అధికారులు ఏసీబీ ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. భర్త వెంకటేశ్వర్ ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఆదాయానికి మించి ఆస్తులు
జయపురం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో అండ్‌బీ విభాగ ఎస్డీఓను జయపురం విజిలెన్స్ విభాగ అధికారులు శుక్రవారంఅరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వివిధ ప్రాంతాలలో గల ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసి లక్షలాది రూపాయల ఆస్తులను కనుగొన్నారు. జయపురం విజిలెన్స్ విభాగ అధికా రులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ ఆర్అండ్బీ కార్యాలయంలో ఎస్‌డీఓగా పనిచేస్తున్న హిమాంశు శేఖర మండల్ ఉమ్మరకోట్ నుంచి ఓఆర్‌టీసీ బస్సులో ఆయన స్వగ్రామం బరంపురం వెళ్తుండగా జయపురం విజిలెన్స్ అధికార బృందం జయపురంలో మాటు వేసి ఆయనను బస్సులోనుంచి దింపి జయపురంలో గల విజిలెన్స్ ఎస్పీ కార్యాలయానికి తీసుకుపోయారు. కార్యాలయంలో ఆయనను తనిఖీ చేసి రూ.లక్షా 28 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లలో ఆయనకు గల ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ దాడులలో ఉమ్మరకోట్‌లో గల ఆయన నివాస గృహంలో రూ.30,800, ఎస్బీఐ పాస్ బుక్ లభించగా..భువనేశ్వర్‌లోని సుందరపదలో ఒక ఇల్లు, బరంపురంలోని కొడాసింగ్ ప్రాంతంలో నిర్మాణంలో గల ఒక భవనం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వాటితో పాటు విలువైన అనేక వస్తువులు కనుగొన్నట్లు విజిలెన్స్ ఎస్పీ హరేకృష్ణ బెహరా వెల్లడించారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి కోరు ్టకు తరలించినట్లు వెల్లడించా రు. ఈ దాడిలో విజిలెన్స్ జయపురం డీఎస్పీ హేనరీ కులు, ఇన్స్పెక్టర్లు శరత్ చంద్ర సాహు, బి.రుద్రయ్య, ఏఎస్ విశ్వరంజన్ బెహరా, సీతాంశు పట్నాయక్ నవరంగ్‌పూర్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ దీనబంధు బెహరా పాల్గొన్నారు. -
చిన్నమ్మలుపు
♦ శశికళ పిటిషన్‌పై ప్రతిష్టంభన ♦ కొత్త న్యాయమూర్తి నియామకం తరువాతనే విచారణ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని పేర్కొంటూ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, సుధాకరన్‌లపై అవినీతి నిరోధకశాఖ 1996లో కేసు పెట్టింది. ఈ కేసు అనేక దశల తరువాత బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు చేరగా, ఈ నలుగురికి న్యాయమూర్తి నాలుగేళ్ల జైలుశిక్ష, అలాగే జయలలితకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురికి తలా రూ.10 కోట్ల జరిమానా విధించారు. ఈ తీర్పు ప్రకారం కొద్దిరోజులు జైలుశిక్షను అనుభవించిన జయలలిత ఆ తరువాత బెయిల్‌పై బైటకు వచ్చి కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేశారు. నలుగురు నిర్దోషులంటూ హైకోర్టు తీర్పుచెప్పడంతో విముక్తులయ్యారు. అయితే ఈ తీర్పును కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ వేరువేరుగా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తులు పినాకీ చంద్రఘోష్, అమిత్వరాయ్ల ముందుకు ఆనాడు విచారణకు వచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష, జరిమానాగా బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. జయలలిత కన్నుమూయడంతో ఆమెకు విధించిన శిక్షను రద్దు చేయగా, శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, సదరు తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ ఈ ముగ్గురు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఆస్తుల కేసులో ప్రధాన నిందితురాలు జయలలిత మృతి, నిర్దోషులుగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని అప్పీలు పిటిషన్లో కోరారు. ఈ అప్పీలు పిటిషన్ బుధవారం కోర్టు ముందుకు రాగా, న్యాయమూర్తులు రోగిందన్ పాలినారిమన్, అమిత్తవరాయ్ విచారించాల్సి ఉంది. అయితే ఈ పునఃపరిశీలన పిటిషన్‌ను విచారించడం సబబు కాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన న్యాయ సలహాదారు ముకుల్ రోహిత్‌కీ న్యాయమూర్తి రోగిందన్ పాలినారిమన్ను మంగళవారం రాత్రి కలిసినట్లు సమాచారం. రోగిందన్ తండ్రి పాలిమన్ నారిమన్ గతంలో జయలలిత ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరిస్తూ అనుకూలంగా వాదించి ఉన్నందున ఈ పిటిషన్‌పై విచారణ జరపడం భావ్యం కాదని రోహిత్‌కీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, సుప్రీం కోర్టులో బుధవారం విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో శశికళ పిటిషన్ చోటు చేసుకోలేదు. అంతేగాక న్యాయమూర్తి రోగిందన్ పాలినారిమన్ విచారణ నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. రోహిత్‌కీ అభ్యర్థన మేరకే న్యాయమూర్తి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కొత్త న్యాయమూర్తి నియామకం తరువాతనే శశికళ పిటిషన్‌పై విచారణ జరగనుంది. -
కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
నెల్లూరు నగరపాలక సంస్థలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పి. కృష్ణయ్య ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు నిర్వహించారు. నెల్లూరులో ఆయన ఇంట్లో జరిగిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన ఆస్తుల వివరాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్గిరి, బెంగుళూరులోని ఆయన సమీప బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.