
పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది.
"పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పిట్ట కథ డైరెక్టర్ చెందు ముద్దు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నిర్మాత సురేష్ బాబు క్లాప్‌నివ్వగా దర్శకులు తరుణ్ భాస్కర్ కెమెరా స్విఛ్ ఆన్ చేసారు అలాగే మొదటి షాట్ కు దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్ రెడ్డి, సందీప్ రాజ్, సాయి రాజేష్, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ...మా మొదటి సినిమా పెళ్లి చూపులు విడుదలైన తేదీ జూలై 29. అదే రోజున మా కొత్త చిత్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దాదాపు అంతా కొత్తవాళ్లే నటిస్తున్న ఈ సినిమాకు కథే స్టార్ అన్నారు. హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. చెందు ముద్దును కలిసినప్పుడు ఈ కథ చెప్పారు. ఈ సబ్జెక్ట్ విన్నాక నా కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనిపించింది అన్నారు.
చదవండి: నాకేదైనా అయితే ఆ మాఫియాను వదలకండి, వెంటాడండి..
పుష్ప 2కి శిష్యుడి సాయం.. అంత సీన్ లేదన్న ఉప్పెన డైరెక్టర్