హీరో రాజ్ తరుణ్‌కి నోటీసులు పంపిన పోలీసులు | Police Issue Notice To Raj Tarun In Lavanya Case | Sakshi
Sakshi News home page

Raj Tarun: ఆ తేదీలోపు స్టేషన్‌లో హాజరవ్వాలి: పోలీసులు

Published Tue, Jul 16 2024 11:24 AM | Last Updated on Tue, Jul 16 2024 11:35 AM

Police Issue Notice To Raj Tarun In Lavanya Case

పోలీస్ కేసులతో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల ముందు మీడియా ముందుకొచ్చిన లావణ్య అనే అమ్మాయి.. ఈ కుర్ర హీరోపై హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ కేసులో రాజ్ తరుణ్‌కి పోలీసులు నోటీసులు పంపించారు. ఈనెల 18 లోపు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద ఇతడికి నోటీసులు జారీ చేశారు.

(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)

రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి ఆరోపణలు చేసింది. నటి మాల్వీ  మల్హోత్రా పరిచయమయ్యాక తనని పట్టించుకోవడం మానేశాడని, దీని గురించి అడిగితే నోటికొచ్చినట్లు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో ఇరికించడం వల్ల 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనని బెదిరించారని లావణ్య చెప్పుకొచ్చింది.

లావణ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మాల్వీ, ఈమె సోదరుడు మయాంక్‌పై కేసు నమోదు చేశారు. రీసెంట్‌గా రాజ్ తరుణ్ తనకు దూరమైపోతాడేమో అనే బాధతో లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ మేరకు పోలీసులు ఈమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement