భార్యను గొడ్డలితో నరికి..  పసికందును సంపులో పడేసి.. | husband brutally murdered wife | Sakshi
Sakshi News home page

భార్యను గొడ్డలితో నరికి..  పసికందును సంపులో పడేసి..

Mar 16 2023 2:49 AM | Updated on Mar 16 2023 1:13 PM

husband brutally murdered wife - Sakshi

అబ్దుల్లాపూర్‌మెట్‌: భార్యను గొడ్డలితో నరికి చంపి.. నెలన్నర పసికందును సంపులో ముంచి హత్య చేశాడో వ్యక్తి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండలం అనాజ్‌పూర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌కు బండరావిరాలకు  చెందిన కందికంటి నర్సింగ్‌రావు పెద్దకూతురు లావణ్య (28)తో 2018లో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఆద్య, రెండు నెలల వయసున్న కుమారుడు క్రియాన్స్‌ ఉన్నాడు. కొంతకాలంగా ధన్‌రాజ్‌ అదనపు కట్నం కోసం భార్యను వేధి స్తున్నాడు.

ఇదే విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దమనుషులు పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. కాగా, డెలివరీ తర్వాత లావణ్య పుట్టింట్లోనే ఉండగా.. కుమారుడికి టీకా వేయించాలని చెప్పి ధనరాజ్‌ బుధవారం లావణ్యను అనాజ్‌పూర్‌కు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా.. కోపోద్రిక్తుడైన ధన్‌రాజ్‌ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అలాగే పసికందును ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో ముంచి హత్య చేశాడు.

తల్లిదండ్రులు గొడవ పడుతుండటాన్ని గమనించిన కూతురు ఏడుస్తూ బయటకు రావడంతో ఇరుగుపొరుగు వచ్చే సరికి ధన్‌రాజ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి , సీఐ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యలకు కారణమని, నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement