
నవ్వించడానికి రెడీ!
మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నవ్వించడానికి రెడీ అంటున్నారు.
మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నవ్వించడానికి రెడీ అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘ఎ’ టీవీ సమర్పణలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు సరసన సోనారిక, రాజ్‌తరుణ్ సరసన హెబ్బా పటేల్ నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించనున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి నటుడు మోహన్‌బాబు సతీమణి నిర్మల కెమెరా స్విచాన్ చేయగా, మోహన్‌బాబు క్లాప్‌నిచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నాగేశ్వరరెడ్డి మార్కు కామెడీ తో ఈ చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గరికపాటి కిషోర్.