అదితీరావ్ హైదరీ, రాజ్‌తరుణ్
‘సమ్మోహనం, అంతరిక్షం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు అదితీరావ్ హైదరీ. ప్రస్తుతం ఆమె ‘వి’ సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నాని హీరోలు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం అదితీని వరించిందని టాలీవుడ్ టాక్.
హీరో రాజ్‌తరుణ్‌కి జోడీగా ఆమె నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ ప్రస్తుతం జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు బ్యానర్‌లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. తాను రాసుకున్న కథకు అదితి అయితేనే న్యాయం చేస్తుందని భావించిన దర్శకుడు, ఆమెతో సంప్రదింపులు జరిపారట. మరి.. అదితీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment