
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపించడమే కాకుండా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, తన సినిమా షూటింగ్స్ వల్ల రాలేకపోతున్నానంటూ ఆయన కొంత సమయం అడిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ హైకోర్టును రాజ్ తరుణ్ ఆశ్రయించారు.
లావణ్య పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రాజ్ తరుణ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ అనంతరం నార్సింగ్ పోలీసుల ఆదేశాలు తీసుకున్న తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment