వర్ష బొల్లమ్మతో రాజ్‌ తరుణ్‌  రొమాంటిక్‌ కామెడీ  | Vijay Deverakonda Releases Ala Ila Analani Song From Raj Tharun Movie | Sakshi
Sakshi News home page

‘అలా ఇలా అనాలని..’ రిలీజ్‌ చేసిన  విజయ్‌ దేవరకొండ

Published Sat, Jul 31 2021 10:49 AM | Last Updated on Sat, Jul 31 2021 10:49 AM

Vijay Deverakonda Releases Ala Ila Analani Song From Raj Tharun Movie - Sakshi

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. సాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నందకుమార్‌ అభినేని, భరత్‌ మగులూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘అలా ఇలా అనాలని..’ అంటూ సాగే పాటని హీరో విజయ్‌ దేవరకొండ రిలీజ్‌ చేసి, చిత్రబృందానికి శుభకాంక్షలు తెలిపారు.

ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా స్వీకర్‌ అగస్తి స్వరపరిచారు. సత్య యామిని, స్వీకర్‌ అగస్తి ఆలపించారు. ‘‘ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రాజ్‌ తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌గా నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద, కెమెరా: శ్రీరాజ్‌ రవీంద్రన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement