హై ఓల్టేజ్‌ యాక్షన్‌ | Gopichand Viswam Journey Video Highlights, Action And Comedy, Deets Inside | Sakshi
Sakshi News home page

హై ఓల్టేజ్‌ యాక్షన్‌

Published Thu, Aug 1 2024 3:10 AM | Last Updated on Thu, Aug 1 2024 1:39 PM

Gopichand Viswam Journey video highlights action and comedy

గోపీచంద్‌ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్‌ ్ర΄÷డక్షన్స్‌ చివరి దశలో ఉన్న ‘విశ్వం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ది జర్నీ ఆఫ్‌ విశ్వం’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’.

శ్రీను వైట్ల మార్క్‌ హ్యుమర్, యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉంటుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపిస్తున్నారు దర్శకుడు. సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయో తెలియజేయడంతో పాటు ఆడియన్స్‌లో ఎగ్జయిట్‌మెంట్‌ని క్రియేట్‌ చేసేలా ఈ వీడియోను అద్భుతంగా డిజైన్‌ చేశారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement