Gopichand and Jagapathi Babu's First Look From Rama Banam Released - Sakshi
Sakshi News home page

Gopichand : రామ‌బాణం పోస్ట‌ర్: ఆకట్టుకుంటున్న గోపీచంద్‌, జగపతిబాబు లుక్‌

Published Thu, Mar 30 2023 4:28 PM | Last Updated on Thu, Mar 30 2023 5:26 PM

Gopichand And Jagapathi Babu Look From Ramabanam Released - Sakshi

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. గతంలో గోపీచంద్‌కి లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్‌కి ఇది మూడో చిత్రం. ఈ వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇవాళ(గురువారం)శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.

ఇందులో గోపీచంద్‌తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు. పంచెకట్టులో చేతులు పట్టుకొని నడుస్తున్న స్పెషల్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్‌ సరసన డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement