గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా హీరోయిన్ | Guess This Actress: Yagnam Movie Heroine Moon Banerjee Latest Photos And Real Life Facts Goes Viral - Sakshi
Sakshi News home page

Guess This Actress: తెలుగులో ఒక్కటే సినిమా చేసిన ఈమెని గుర్తుపట్టారా?

Published Sat, Mar 2 2024 9:21 PM | Last Updated on Sun, Mar 3 2024 11:34 AM

Yagnam Movie Actress Moon Banerjee Latest Pics And Details - Sakshi

టాలీవుడ్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. మరోవైపు పాత హీరోయిన్లు మెల్లమెల్లగా కనుమరుగు అవుతూనే ఉంటారు. ఫ్లాప్స్ పడ్డోళ్లు వెళ్లపోయారంటే ఓ అర్థముంది. కానీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కొందరు బ్యూటీస్ సైడ్ అయిపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి స్టోరీనే. తెలుగులో ఒక్కటే సినిమాతో అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల్నే పక్కనబెట్టేసింది. మరి ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మూన్ మూన్ బెనర్జీ. కనీసం ఈ పేరు కూడా ఎప్పుడూ విన్నట్లు లేదే అని అనుకుంటున్నారా? కంగారూ పడకుండి. గోపీచంద్‌కి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'యజ్ఞం' గుర్తుందా? అందులో హీరోయిన్‌గా చేసింది ఈమెనే. కోల్‌కతాకు చెందిన మూన్ మూన్ బెనర్జీ.. 1997 నుంచి హిందీ సీరియల్స్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడంతో తెలుగులో మూవీ చేసింది.

మరి ఏమైందో ఏమో గానీ 'యజ్ఞం' తర్వాత తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ సినిమా చేయలేదు. సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా 'దోరీ' అనే సీరియల్‌లో నటిస్తోంది. అయితే టాలీవుడ్‌లో చేస్తున్నప్పుడు యుక్త వయసులో ఉంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనిపించలేదు. తాజాగా వయసు పెరగడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇకపోతే 2010లో నీరజ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement