
ఒకప్పుడు విలన్.. తర్వాత హీరో.. ఎన్నో సూపర్ హిట్స్ చూసిన గోపీచంద్ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు. ఆయన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతుండటంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. తన ఆశలన్నీ భీమా సినిమాపైనే పెట్టుకున్నాడు. కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 8న రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్‌గా నటించారు.
అలా చెప్పుకోవడం ఇష్టముండదు
తాజాగా ఓ షోకి హాజరైన గోపీచంద్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు చాలామందిని చదివిస్తున్నావు.. ఎందుకని బయటకు చెప్పుకోవడం లేదు అని యాంకర్ అడిగాడు. అందుకు హీరో స్పందిస్తూ.. నాకలా చెప్పుకోవాలని ఉండదు. ఎవరైతే బాగా చదువుతారో వారికి సాయం చేద్దామనుకుంటాను. కొంతమందికైతే ఆ చదివించేది నేనేనని కూడా తెలియదు అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్-గోపీచంద్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందా? అన్న ప్రశ్నకు.. కచ్చితంగా ఓ సినిమా చేస్తామని చెప్పాడు. కానీ అదెప్పుడు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు.
చదవండి: ఇప్పటికే మూడు ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి.. అయినా కోలుకోలేని స్థితిలో..
Comments
Please login to add a commentAdd a comment