
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ సాగేపాటని విడుదల చేసింది చిత్రయూనిట్.
‘మొండి తల్లి పిల్ల నువ్వు.. అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి, కలకు భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈపాటని సాహితీ చాగంటిపాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూ΄పొందిన చిత్రం ‘విశ్వం’.
ఇటీవల విడుదలైన తొలిపాట ‘మొరాకో మగువా..’ కి మంచి స్పందన వచ్చింది. ‘తల్లి, కూతురు నేపథ్యంలో వచ్చే ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’పాట కథలోని భావోద్వేగాల లోతును తెలియజేస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్.
Comments
Please login to add a commentAdd a comment