Gopichand 31st film launched with formal Pooja ceremony - Sakshi
Sakshi News home page

కన్నడ దర్శకుడుతో గోపీచంద్‌ కొత్త సినిమా..మాస్‌ యాక్షన్‌ షురూ

Published Sat, Mar 4 2023 11:59 AM | Last Updated on Sat, Mar 4 2023 12:16 PM

Gopichand 31st Film Launched - Sakshi

గోపీచంద్‌ కెరీర్‌లో 31వ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మించనున్నారు. రాధామోహన్‌ మాట్లాడుతూ.. ‘మా బేనర్‌లో 14వ చిత్రాన్ని గోపీచంద్‌, హర్ష కాంబినేషన్‌లో నిర్మించడం ఆనందంగా ఉంది. కన్నడలో పలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించిన హర్ష ఈ భారీ బడ్జెట్‌ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు.

ఇప్పటి వరకూ గోపీచంద్‌ పలు భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లు చేశారు. ఈ చిత్రం వాటికి భిన్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్న మాసీవ్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ నెలలోనే షూటింగ్స్‌ ఆరంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, కెమెరా: స్వామి.జె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement