తరువాతి సినిమా 'జగదేకవీరుని కథ' | Allu Sirish’s next gets a title | Sakshi
Sakshi News home page

తరువాతి సినిమా 'జగదేకవీరుని కథ'

Published Fri, Jul 29 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

తరువాతి సినిమా 'జగదేకవీరుని కథ'

తరువాతి సినిమా 'జగదేకవీరుని కథ'

'శ్రీరస్తు శుభమస్తు' రిలీజ్ కాకముందే అల్లు శిరీష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎమ్.వి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించనున్న ఆ సినిమాకు 'జగదేకవీరుని కథ' అనే ఆసక్తికర టైటిల్ను కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శిరీష్ సరసన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్ నటించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.

లావణ్య త్రిపాఠితో కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ 'శ్రీరస్తు శుభమస్తు' ట్రైలర్ ఇటీవలే విడుదలై పలువురు సినీ ప్రముఖుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. వచ్చే వారం సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement