మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ | mehreens bollywood debut in anushka sharma production | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ

Mar 3 2016 12:31 PM | Updated on Aug 29 2018 9:26 PM

మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ - Sakshi

మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ

తొలి సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మెహరీన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మహాలక్ష్మీగా వెండితెరకు పరిచయం...

తొలి సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మెహరీన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో మహాలక్ష్మీగా వెండితెరకు పరిచయం అయిన ఈ భామ, తన నటనతో ఆకట్టుకుంది. తెర మీద కాస్త బొద్దుగా కనిపించినా.., గ్లామర్తో పాటు పర్ఫామెన్స్లోనూ మంచి మార్కులు సాధించింది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.
 
ఇప్పటికే తెలుగులో కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్, బీవీయస్ రవి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. వీటితో బాలీవుడ్లోనూ ఓ సినిమాను అంగీకరించింది మెహరీన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో పంజాబీ అమ్మాయిగా నటించనుంది మెహరీన్. పలు ప్రకటనల్లో నార్త్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్గా అలరించడానికి రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement