నాని.. బాలకృష్ణ అభిమాని కాదా..? | Nani Clarifies on Balakrishna | Sakshi
Sakshi News home page

నాని.. బాలకృష్ణ అభిమాని కాదా..?

Published Sun, Feb 7 2016 9:24 AM | Last Updated on Wed, Aug 29 2018 9:26 PM

నాని.. బాలకృష్ణ అభిమాని కాదా..? - Sakshi

నాని.. బాలకృష్ణ అభిమాని కాదా..?

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మొగాడివోయ్ సినిమాలతో మంచి ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకుక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాని హీరో బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్నాడన్న వార్త నందమూరి అభిమానుల్లో కూడా అంచనాలను పెంచేసింది. సినిమా పోస్టర్స్, టీజర్లో నాని చేతి మీద జై బాలయ్య అనే టాటూ కనిపించటం కూడా ఈ టాక్కు మరింత బలం ఇచ్చింది. అంతేకాదు ఈసినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారన్న టాక్ కూడా బలంగా వినిపించింది.

అయితే తాజాగా ఈ విషయం పై నాని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో తాను బాలయ్య అభిమానిగా నటిస్తున్నాడా లేదా అన్న విషయం చెప్పకుండానే, జై బాలయ్య అన్న టైటిల్ ఎప్పుడు పరిశీలించలేదని, ఈ సినిమా 15 ఏళ్ల టైం ఫ్రేం లో జరిగే ప్రేమకథ అని, అలాంటి సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ అసలు సూట్ అవ్వదని వివరణ ఇచ్చాడు. అసలు ఈ సినిమాలో నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ప్రమోషన్లో భాగంగా నాని ఈ కామెంట్స్ చేశాడు. అందాలరాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మెహరీన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement