jagadishwar reddy
-
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్‌లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు. స్పీకర్ గురించి జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారంటే?తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. -
సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్’ టీజర్ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్‌లో, ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘యూఎస్‌లో చదువుకుని, అక్కడే జాబ్ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడారు. -
రేవంత్ రెడ్డికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కౌంటర్
-
కారుతో తొక్కించి.. దారుణంగా హతమార్చి..
షాద్‌నగర్: బీమా డబ్బులు కాజేసేందుకు నలుగురు వ్యక్తులు డ్రామా ఆడారు. యువకుడిని హాకీ స్టిక్‌తో కొట్టి నడిరోడ్డుపై పడేసి కారుతో తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఏడాది క్రితం జరిగిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్ద శివారులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును షాద్‌నగర్ పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కంపెనీ ఏర్పాటు చేసి.. : వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం బోడ తండాకు చెందిన బోడ శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలంగా హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రేష్ట రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఓ కంపెనీ ఏర్పాటు చేసి ఫేక్ ఉద్యోగాలు సృష్టించాడు. పని చేస్తామంటూ వచ్చిన వారి పేర్లపై క్రెడిట్‌కార్డులు తీసుకొని, వాటి ద్వారా డబ్బులు తీసుకుంటూ బ్యాంకులను మోసం చేస్తూ విలాసవంతమైన జీవితం సాగిస్తున్నాడు. గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన భిక్షపతి అనే యువకుడు శ్రీకాంత్ వద్ద పని చేసేందుకు వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరన్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్.. అతడి పేరు మీద రూ.50లక్షల బీమా పాలసీ తీశాడు. పాలసీకి నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. 2021లో ఐసీఐసీఐ బ్యాంకులో రూ.52 లక్షలు లోన్ తీసుకుని మేడిపల్లిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి భిక్షపతి పేరున రిజిస్టర్ చేయించాడు. తర్వాత డబ్బులు అవసరం ఉండటంతో శ్రీకాంత్ ఆ ఇంటిని అమ్మకానికి పెట్టగా, భిక్షపతి అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలనుకున్న శ్రీకాంత్ తనకు పరిచయం ఉన్న అప్పట్లో మల్కాజిగిరిలో హెడ్‌కానిస్టేబుల్‌గా (ప్రస్తుతం సైబరాబాద్ సీసీఎస్‌లో..) పనిచేస్తున్న మోతీలాల్‌ను కలిశాడు. తనకు సాయం చేస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పడంతో భిక్షపతిని హత్య చేసేందుకు హెడ్‌కానిస్టేబుల్ పథకాన్ని రచించాడు. కారులో తీసుకెళ్లి హత్య : భిక్షపతిని హత్య చేసేందుకు శ్రీకాంత్ తన వద్ద పని చేస్తున్న మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం రాముతండాకు చెందిన బానోతు సమ్మన్న, వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన చాగంటి సతీష్ సాయం తీసుకున్నాడు. సమ్మన్న, సతీష్ కు చెరో రూ.5లక్షల చొప్పున, హెడ్‌కానిస్టేబుల్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 22 డిసెంబర్, 2021న నలుగురూ కలిసి భిక్షపతిని కారులో షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్దకి తీసుకొచ్చి మద్యం తాగించారు. తర్వాత భిక్షపతి తలపై హాకీ స్టిక్‌తో బలంగా కొట్టి కింద పడేశారు. అతనిపై నుంచి రెండుసార్లు కారును నడిపించి హతమార్చారు. బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు వచ్చినప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తుచేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. çనలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కుషాల్కర్ నేతృత్యంలోని సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాంబాబు, కానిస్టేబుల్స్ కేసును చేధించారు. -
కమిషనర్ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్( జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీజేపీ శ్రేణులు నగర పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచినా వారిపై కేసులు నమోదు చేయడం లేదని రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఆగడాలపై ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇల్లు ముట్టడి: మాన్సూరాబాద్ డివిజన్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. డివిజన్ నుంచి వెళ్లిపోవాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ల వెంటనే వెళ్లిపోయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలతో పాటు తెరాస నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహరెడ్డి అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడినుండి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెనుదిరిగారు. చిన్నారులతో డబ్బు పంపిణీ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థులు డబ్బుల పంపిణీకి కొత్త పంథా ఎంచుకున్నారు. కార్యకర్తలతో పంపిణీ చేస్తే పోలీసులు, ప్రతిపక్షాల నుంచి తలనొప్పులు వస్తాయని ఎవరికి అనుమానం రాకుండా చిన్న పిల్లలు ద్వారా డబ్బు పంపినీకి పూనుకున్నారు. నగరంలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో గడ్డిఅన్నారం డివిజన్లో చిన్నారులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కెమెరాకు చిక్కారు. అయితే వీడియో తీయడం చూసి ఆ చిన్నారులు వెళ్లిపోవడంతో.. వారు ఎవరి పార్టీ తరుఫున నగదు పంచుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
సకుటుంబ సమేతం ..
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కుటుంబాలు ప్రచారంలో మునిగాయి. అభ్యర్థుల సతీమణులు, తనయులు, సోదరులు, ఇతర బంధువర్గం అంతా రంగంలోకి దిగడంతో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కుటుంబ సభ్యులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున వారి సతీమణులు, కుటుంబంలోని మహిళలు.. మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి, పార్టీ గుర్తులను చూపిస్తూ ఈ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం రోజుకూ పట్టణాల్లో వార్డులు, గ్రామాల్లో ప్రచారం చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే కుటుంబ సభ్యులు బృందాలుగా ప్రచార రథాలతో బయటకు వెళ్లి సాయంత్రం వరకు వస్తున్నారు. ఇక మిగిలిన ఈ పది రోజుల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో ప్లాన్ ప్రకారం ముందుకు కదులుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత, ఆయన సోదరుల తనయులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావు సతీమణి లక్ష్మి, కుమారులు వరుణ్, అరుణ్, కోడళ్లు సుష్మ, అనూష నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి, ఆయన సోదరులు కృష్ణారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ సతీమణి ఇందిర, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి చెల్లెలు భవాని నియోజకవర్గంలో పాల్గొంటున్నారు. తుంగతుర్తిలో ప్రచారం చేస్తున్న గాదరి కిశోర్ సతీమణి కమల తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ సతీమణి కమల, బీజేపీ అభ్యర్థి రాంచంద్రయ్య సతీమణి సరస్వతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.హుజూర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.పద్మావతి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమె రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆయన భార్య రజితారెడ్డి, తల్లి సత్యవతి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇలా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కుటుంబాలు ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నేరేడుచర్ల : కందులవారిగూడెంలో ప్రచారం చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి సతీమణి రజిత -
ఆ ఐదు.. ఆసక్తికరం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రచార రంగం మరింత వేడెక్కుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నువ్వా–నేనా అన్న చందంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఒక విధంగా సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్ని కలు కీలకంగా మారాయి. మాజీ అమాత్యులపై పోటీ పడుతున్న వారూ అనూహ్యంగా విజయం సొంతం చేసుకోవాలని శ్రమ పడుతున్నారు. దీంతో ప్రచారం వేడివేడిగా సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను మాత్రమే కాకుండా, పలువురు తమ తరఫున ప్రచారం చేసేం దుకు కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. హాట్ టాపిక్‌గా .. ఐదు చోట్ల ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రులు పోటీ చేస్తున్న ఆ ఐదు నియోజకవర్గాలు హాట్ టాపిక్‌గా మారాయి. సూర్యాపేట నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా రెండో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కేసీఆర్ కేబినెట్లో అవకాశం దక్కించుకున్న జగదీశ్‌రెడ్డి ఈ సారి గెలుపును సవాల్‌గా తీసుకుని శ్రమిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి 2009లో ప్రాతినిధ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈసారి గెలుపుపై దృష్టి పెట్టారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయంపై, మొత్తంగా ఐదో విజయంపై కన్నేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికను కీలకంగా భావిస్తున్నారు. 2009 –2014 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఈ సారి ఎన్నిక సవాల్‌గా మారింది. అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డున్న కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎనిమిదో విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈసారి ఎన్నికను ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో ఐదో విజయంపై కన్నేశారు. 2009లో కాంగ్రెస్ ప్రభుతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లాలో మరో సీనియర్ రాజకీయ నాయకుడు , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఆలేరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన ఇక్కడ నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆలేరు నుంచి పోటీకి దిగుతున్నారు. ఈ సారి ఆయనకు బీఎల్ఎఫ్ మద్దతు ఇస్తోంది. సుదీర్ఘ కాలం ఆలేరుకు ప్రాతినిధ్యం వహించిన నర్సింహులు ఆలేరు అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు. మొత్తంగా జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో ఐదుగురు మాజీ మంత్రులు, ఒక ఆపద్ధర్మ మంత్రి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదనపు బాధ్యతలతో.. ఒత్తిడి ఈ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ పడుతున్న మంత్రులుగా చేసిన ఆరుగురిలో ఐదుగురిపై అదనపు బాధ్యతల ఒత్తిడి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక వైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ, తన గెలుపు కోసం శ్రమిస్తూనే.. జిల్లాలోని టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికను పరిశీలించాల్సి వస్తోందంటున్నారు. ప్రధానంగా ఆయన సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం దృష్టి పెట్టాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. సూర్యాపేట స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తుంగతుర్తి బాధ్యతను కూడా చూస్తున్నారు. టీ పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర ఎన్నికల సారథ్య బాధ్యతలు మోస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకించి తన నియోజకవర్గంతో పాటు, పొరుగునే ఉన్న కోదాడపైనా దృష్టిపెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఆయన భార్య, తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెండో సారి పోటీలో ఉన్నారు. కోదాడ నుంచి రెండు పర్యాయాలు గెలిచిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోదాడను తమ చేయి దాటిపోకుండా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. సీనియర్ నేత కె.జానారెడ్డి తన నియోజకవర్గం నాగార్జునసాగర్‌తో పాటు, పొరుగునే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గ బాధ్యతలు కూడా చూస్తున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను గెలిపించాల్సిన బాధ్యత కూడా జానారెడ్డిపైనే పడిందని పేర్కొంటున్నారు. ఐదో విజయం కోసం పోటీలో ఉన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో తన గెలుపుకోసం శ్రమిస్తూనే.. తమ సొంత నియోజకవర్గమైన నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కోసం కూడా పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఆయన ఒక సారి ప్రచారానికి వెళ్లి వచ్చారు. ఇలా.. ఒక అపద్ధర్మ మంత్రి, నలుగురు మాజీ మంత్రులకు తమ నియోజకవర్గాలతో పాటు ఇతర స్థానాల బాధ్యత మీద పడిందని విశ్లేషిస్తున్నారు. -
అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీలో వర్గవిభేదాలు
-
అక్క క్షేమం కోసమే హత్యలు
మదనపల్లె క్రైం : మదనపల్లె పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో రక్తచరిత్ర సృష్టిస్తూ హత్యలకు పాల్పడుతున్న రౌడీషీటర్ జగ్గు అలియాస్ జగదీశ్వర్‌రెడ్డి, ప్రదీప్ అలియాస్ అమరనాథ్‌ను అక్క క్షేమం కోసమే హత్య చేశామని నిందితులు తెలిపారు. సీటీఎం సమీపంలో గత నెలలో జరిగిన జంట హత్యల కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు సోమవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో సీఐ మురళి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, హరిహరప్రసాద్, సునీల్‌కుమార్ మీడియా ముందు అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా నిందితుడు పెద్దపల్లె శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రౌడీషీటర్ జగ్గు అలియాస్ జగదీశ్వర్‌రెడ్డి, ప్రదీప్ అలియాస్ అమరనాథ్ సాధారణ హంతకులు కాదన్నారు. జగదీశ్వర్‌రెడ్డి 2010 నుంచి మూడు హత్యలు, అమరనాథ్ రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితులని తెలిపారు. ఈ విషయం తెలిసీ తన తోబుట్టువును ఇచ్చి పెళ్లి చేసేందుకు మనసు అంగీకరించలేదన్నారు. అందుకే పథకం ప్రకారం స్నేహితులతో కలిసి హత్య చేయాల్సి వచ్చిందని వివరించాడు. డీఎస్పీ మాట్లాడుతూ గత నెల 28న రాత్రి కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ పెద్దపల్లెకు ఆనుకుని ఉన్న మామిడి తోటలో తంబళ్లపల్లె మండలం ఎర్రమద్దిపల్లె నుంచి వచ్చి నీరుగట్టువారిపల్లెలో చేనేత కార్మికుడిగా స్థిరపడిన జగ్గు అలియాస్ జగదీశ్వర్‌రెడ్డి, మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ జంగాలపల్లెకు చెందిన ప్రదీప్ అలియాస్ ఎస్.అమరనాథ్‌ను దారుణంగా నరికి చంపారని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి కుమారుడు శివారెడ్డి అలియాస్ శివశంకర్‌రెడ్డి(28), నిమ్మనపల్లె మండలానికి చెందిన సింహ అలియాస్ గాది వెంకటరమణ(27), చల్లా వెంకటేష్ అలియాస్ మహేష్(25), మునిరత్నం కుమారుడు ప్రొద్దుటూరు మునిరాజ అలియాస్ పులి(27), తిమ్మాపురానికి చెందిన ముతకన యోగా అలియాస్ యోగానందరెడ్డి (24), కురబలకోట పెద్దపల్లెకు చెందిన పూలవెంకటరమణ అలియాస్ చినప్ప(25), గుర్రంకొండ సుంకరపల్లెకు చెంది న క్రిష్ణమూర్తి కుమారుడు ఎస్.రాము(30)తో కలిసి పథకం ప్రకారం మామిడి తోటలో విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి చీకటి పడ్డాక 8:30 గంటల సమయంలో పథకం ప్రకారం ముందుగా జగదీశ్వర్‌రెడ్డిని కొడవళ్లు, కత్తులతో పొడిచి హత్య చేశారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న అమరనాథ్‌ను కూడా హత్య చేశారన్నారు. వెంటనే జగదీశ్వర్‌రెడ్డి వాహనంలో ఆయుధాలు తీసుకుని పరారైనట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు సీఐ మురళి నాలుగు బృందాలను ఏర్పాటుచేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వేకువజామున ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హత్యకు పాల్పడిన వారు వారిలో కొంతమంది పాత నేరస్తులు ఉన్నారని పేర్కొన్నారు. వీరంతా రౌడీలుగా చెలామణి అవుతూ పండగల సమయంలో దందాలు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు చెప్పారు. కొందరు పాత్రికేయులు, నాయకుల హస్తం ఉండడంతో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఇదే కేసులో ఉన్న మరో ఇద్దరిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్ప డితే 100కు కాల్ చేయాలన్నారు. -
ఏపీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు
-
ఏపీఈడబ్ల్యూఐడీసీ సీఈ ఇళ్లపై ఏసీబీ దాడులు
-
ఏపీ చీఫ్ ఇంజనీర్ ఇళ్లపై ఏసీబీ దాడులు
-
ఏపీ చీఫ్ ఇంజనీర్ ఇళ్లపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: ఏపీకి చెందిన మరో ఉన్నతాధికారి ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్‌రెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్‌రెడ్డి ఇళ్లలో సోమవారం ఉదయం నుంచి ఏసీపీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు సూర్యాపేట, మహబూబ్‌నగర్, విజయవాడ, చెన్నై సహా పన్నెండు ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో సుమారు 16 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి 100 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మంత్రి జగదీశ్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
కాన్వాయ్కి అడ్డొచ్చిన ఇన్నోవాను తప్పించబోయి ప్రమాదం కట్టంగూర్: మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్కి అడ్డొచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మంత్రి సూర్యాపేట జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్దకు ఆయన కాన్వాయ్ రాగానే అదే సమయంలో గ్రామంలో నుంచి ఓ ఇన్నోవా కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చింది. దానిని తప్పించేందుకు కాన్వాయ్‌లో ముందున్న వాహన డ్రైవర్ పూర్తిగా కుడివైపునకు తిప్పాడు. దీంతో ఆ వాహనం హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు వైపునకు దూసుకెళ్లింది. ఇదే క్రమంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మంత్రి కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టింది. వాహనంలో ఉన్న మంత్రి అటెండర్ లింగయ్య, భద్రతాధికారి అవినాశ్‌రెడ్డి, మంత్రి బంధువు కరుణాకర్‌రెడ్డి, ఇన్నోవా డ్రైవర్ కృష్ణతో పాటు గరిడేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరెపూరి సత్యానికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరిలో లింగయ్య, సత్యం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు తరలించారు. -
తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం
-
బదిలీ చేయండి.. వెళ్లిపోతాం
రంగారెడ్డి జిల్లా : ‘మా రాష్ట్రానికి బదిలీ చేయండి.. వెంటనే వెళ్ళిపోతాం.’ అంటూ తెలంగాణలో పనిచేస్తున్న 148 మంది ఆంధ్ర ప్రాంత టీచర్ల వేడుకుంటున్నా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిపోవ డంతో.. గతంలో ఉన్న విద్యాశాఖ నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో అంతర్ జిల్లా బదిలీ ప్రక్రియతో సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్రం విడిపోవడంతో.. ఓపెన్ కేటగిరీలో జిల్లాలో నియమితులైన పలువురు టీచర్లు ఇక్కడే పనిచేస్తున్న టీచర్లు సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశం లేదు. గతవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని రెండుదఫాలుగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. అయినా కానీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. -
జగదీశ్వర రెడ్డి ప్రొడ్యూస్ చేస్తోన్న డాక్యుమెంటరీ
-
ఎటూ ‘సెట్’ కాలేదు
-
తెలంగాణ విధానాన్ని గవర్నర్ సమర్థించలేదు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వ వాదనను, విధానాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమర్థించినట్టుగా కొన్ని మీడియా వర్గాల్లో వెలువడిన కథనాలు నిజం కాదని రాజ్‌భవన్ వర్గాలు వివరించాయి. ఈ మేరకు రాజ్‌భవన్ మీడియా కార్యదర్శి శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ చర్చిం చుకొని ఓ పరిష్కారాన్ని కనుగొనాలి’ అని గవర్నర్ సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
రేపు సెట్స్ తేదీలు ప్రకటిస్తాం
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీల ప్రకటనను సోమవారాని(5వ తేదీ)కి వాయిదా వేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మ న్ పాపిరెడ్డి తెలిపారు. గవర్నర్ నరసింహన్ ఎంసెట్ అంశంపైనే ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినందున.. ఆయనపై ఉన్న గౌరవంతో తేదీల ప్రకటనను వాయిదా వేసినట్లు చెప్పారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యామండలి కార్యదర్శి వికాస్‌రాజ్, చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు మల్లేశ్, వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు, సాంకేతిక విద్యా కమిషనర్ అనిల్‌కుమార్, వివిధ వర్సిటీల వీసీలతో సమావేశం జరిగింది. అనంతరం పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్‌తోపాటు ఇతర సెట్స్ తేదీలపై సమావేశంలో చర్చించినట్లు తెలి పారు. అయితే గవర్నర్ భేటీ నేపథ్యంలో ఆయనపై గౌరవంతో తేదీలను ప్రకటించడం లేదని, ఈ నెల 5వ తేదీన ప్రకటిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. అయితే ఎంసెట్‌ను తొలుత మే 3న నిర్వహించాలనుకున్నా.. దానిని మే 17న నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలి సింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ సెట్స్ తేదీలు ఇలా ఉండే అవకాశం ఉంది.. వీటిల్లో మార్పులు ఉండొచ్చు.. సెట్స్ జరిగే అవకాశమున్న తేదీలు తేదీ సెట్ నిర్వహణ సంస్థ మే 17 ఎంసెట్ జేఎన్టీయూహెచ్ మే 6 ఐసెట్ కాకతీయ వర్సిటీ మే 24 ఎడ్‌సెట్ ఓయూ మే 14 ఈసెట్ ---- మే 30 పీజీఈసెట్ ---- మే 27 లాసెట్, పీజీలాసెట్ ----- మే 20 పీఈసెట్ ----- -
ఎటూ ‘సెట్’ కాలేదు
ఎంసెట్ నిర్వహణపై కొనసాగుతున్న ప్రతిష్టంభన అధికారం మాదంటే మాది అని ఇరు రాష్ట్రాల వాదనలు గవర్నర్‌తో మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశం మధ్యేమార్గంగా పలు సూచనలు చేసిన నరసింహన్ చెరో ఏడాది.. లేదంటే చెరో ఐదేళ్లు నిర్వహించుకోండి ఈసారికి తెలంగాణకు.. వచ్చే ఏడాది కేంద్రం చెప్పినట్లు చేయండి ఏదేమైనా చర్చలతోనే సమస్యకు పరిష్కారం చూపాలని సూచన రేపు భేటీ కానున్న ఇరు రాష్ట్రాల విద్యామంత్రులు..! తెలంగాణ సెట్స్ తేదీల ప్రకటన వాయిదా సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షల అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.. ఇరు రాష్ట్రాలూ పట్టువిడవకుండా వ్యవహరిస్తుండడంతో వివాదం సమసిపోయే అవకాశం కనిపించడం లేదు.. శనివారం గవర్నర్ నరసింహన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావుతో సమావేశమై చర్చించినా వ్యవహారం కొలిక్కి రాలేదు. భేటీలో ఇరువురు మంత్రులూ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ అధికారం తమదేనంటూ ఎవరికి వారే వాదన వినిపించినట్లు సమాచారం. అయితే మధ్యే మార్గంగా గవర్నర్ పలుసూచనలు చేశారు. ఏ నిర్ణయమైనా సరే.. ఇరు రాష్ట్రాల మంత్రులు కూర్చుని చర్చించిన తర్వాతే ప్రకటించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గవర్నర్ సూచన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విద్యా మంత్రులు సోమవారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని మంత్రులిద్దరూ ధ్రువీకరించలేదు. ఏదో ఒకటి తేల్చండి..: విద్యార్థుల ఆందోళనలను తొలగించేలా, వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాలకు సూచించినట్లు తెలిసింది. ఎంసెట్‌ను విడివిడిగాా అయినా, ఉమ్మడిగా నిర్వహించినా... ఇద్దరు కలిసి చర్చించి ప్రకటించాలని సూచించినట్లు తెలిసింది. అయితే రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడమే మంచిదని పేర్కొన్నట్లు సమాచారం. లేదంటే చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని, ఇందుకు రెండు రాష్ట్రాలు చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అలా కాకపోతే ఒక ఏడాది తెలంగాణ మరో ఏడాది ఆంధ్రప్రదేశ్ నిర్వహించేలా ఒప్పందానికి రావాలని... లేదా చెరో ఐదేళ్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఒప్పందం చేసుకోవాలని సూచించినట్లు తెలి సింది. లేదంటే ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి నిర్వహణ అధికారం అప్పగించి, వచ్చే ఏడాది నుంచి కేంద్రం ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకునేలా ఒప్పందం చేసుకోవాలని కూడా నరసింహన్ సూచించినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటిపై మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని మంత్రులకు గవర్నర్ తెలిపారు. ఎవరికివారు మొండి వాదనలతో న్యాయ వివాదంగా మారకుండా చూడాలని వారికి హితవు పలికినట్లు తెలిసింది. అయితే రెండు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు మాత్రం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం అధికారం తమదంటే.. తమదేనని గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం పరీక్ష నిర్వహించేలా ఒప్పందం చేసుకుని... ఆ తరువాత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవాలన్న గవర్నర్ సూచనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. స్పష్టత లేకపోవడంతోనే సమస్య! పునర్వ్యవస్థీకరణ చట్టంలో పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను, కోటా, రిజర్వేషన్లను కొనసాగించాలని ఉందిగాని.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఎవరు నిర్వహించాలన్న విషయంలో స్పష్టత లేదు. ముఖ్యంగా రెండు అంశాలపై గందరగోళం నెలకొంది.. సెక్షన్ 75 ప్రకారం పదో షెడ్యూల్లోని సంస్థలు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రజలకు వివక్ష లేకుండా సేవలందించాలి. ఆ సేవలను పొందేందుకు 2 రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలి. లేకుంటే కేంద్ర నిర్ణయమే అంతిమం అవుతుంది. న్యాయ పోరాటం చివరి యత్నమే: గంటా ‘ఉమ్మడి ఎంసెట్ కోసం న్యాయ పోరాటమనేది ఏమీ వీలు కానప్పుడు మేము తీసుకొనే అంతిమ నిర్ణయం అవుతుంది’ అని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. శని వారం సాయంత్రం తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు గంటా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఎంసెట్‌పై గవర్నర్ చేసిన సూచనలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్‌కు లిఖితపూర్వక లేఖ ఇచ్చారు. ఉమ్మడిగా పరీక్షల కోసం ఏ విధానానికైనా తాము కట్టుబడి ఉంటామని గంటా గవర్నర్‌కు వినిపించడంతో పాటు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. సెక్షన్ 75 ప్రకారం.. పదో షెడ్యూల్లోని సంస్థలు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వివక్ష లేకుండా గతంలో మాదిరిగానే సేవలు అందించాలి. ఆ సేవలను పొందేందుకు రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలి. లేనిపక్షంలో కేంద్రం తీసుకునే నిర్ణయమే అంతిమం. మా పరిధిలోనే ఉండాలి...: తెలంగాణ ఏపీ ఉన్నత విద్యా మండలి భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నందున.. అది తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేయాలి. కానీ ఏపీ ఉన్నత విద్యా మండలి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనల మేరకు పనిచేసింది. మొన్నటి ఇంజనీరింగ్ ప్రవేశాల సందర్భంగా కొంత గడువు పెంచాలని మేం సుప్రీంకోర్టును కోరాం. కానీ గడువులోగా ప్రవేశాలను పూర్తిచేస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. అంటే అది ఏపీ ప్రభుత్వం కోసమే పనిచేస్తోంది. మాకు ఇప్పటివరకు ఏ విషయంలోనూ అధికారికంగా జవాబుదారీగా పని చేయలేదు. దీంతో విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి పరీక్షల నిర్వహణ అధికారం మాకే ఉంది. ఏపీ ప్రభుత్వం అడిగితే సేవలు అందిస్తాం. ఒకవేళ ఏపీ వాదన సరైంది అనుకున్నా... మాతో చర్చించకుండా, ఏకపక్షంగా ఏపీ మండలి పరీక్షల తేదీలను ఎలా ప్రకటిస్తుంది? వారి మండలికి చట్టబద్ధత లేదు: ఏపీ సెక్షన్ 101 ప్రకారం జీవో ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఉమ్మడి పరీక్ష నిర్వహించే అధికారం లేదు. నిబంధనల ప్రకారం పదో షెడ్యూల్లోని సంస్థలు స్వతంత్రంగానే ఉంటాయే తప్ప.. వాటిని ఏదో ఒక్క ప్రభుత్వానికి సంబంధించినవిగా పరిగణించడానికి వీల్లేదు. అందుకే విభజన చట్టంలో ఏపీ 58 శాతం, తెలంగాణ 42 శాతం వాటాగా ఆయా సంస్థలకు నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు. సెక్షన్ 101 ప్రకారం జీవో ద్వారా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేయడం పదో షెడ్యూల్‌కు, సెక్షన్ 75కు విరుద ్ధం. పదో షెడ్యూల్‌కు సంబంధం లేని సంస్థలను మాత్రమే 101 సెక్షన్ ద్వారా తెలంగాణ ఏర్పాటుచేసుకోవాలి. అలా ఏర్పడే సంస్థలు తెలంగాణ పరిధిలో మాత్రమే పనిచేస్తాయి. దాని ప్రకారం ఏర్పడిన తెలంగాణ మండలి ఏపీకి సేవలందిస్తుందని పేర్కొనడం చట్ట విరుద్ధం. సెక్షన్ 95 ప్రకారం... విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఇరు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇప్పుడున్న కోటా, రిజర్వేషన ్లను పాటిస్తూ, ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను పదేళ్ల పాటు కొనసాగించాలి. పదేళ్ల పాటు కోటా ఇస్తాం..: తెలంగాణ హైదరాబాద్ పరిసరాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లోని సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు విభజన చట్టంలో పదేళ్ల నిబంధనను విధించారు. అందుకు మేం సిద్ధం. తెలంగాణలోని విద్యా సంస్థల్లోని 15 శాతం ఓపెన్ కోటా సీట్లను మెరిట్ ఆధారంగా తెలంగాణ, ఏపీ విద్యార్థులతో భర్తీ చేస్తాం. అందుకోసమే ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని ప్రవేశాల కమిటీలోనూ సభ్యుడిగా చేర్చాం. ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి విద్యా సంస్థల్లోని 15 శాతం ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులతోపాటు తెలంగాణ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తే సరిపోతుంది. ఇక్కడి విద్యార్థులు ఏపీలో, ఏపీ విద్యార్థులు ఇక్కడ పోటీ పడాల్సిందల్లా ఆ 15 శాతం సీట్లలోనే. దానికి పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టిన పుడు అభ్యంతరం ఏముంది. సాధ్యం కాదు..: ఏపీ పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ అంటే పరీక్షల నిర్వహణతో కూడా కూడుకున్నదే. పరీక్షలు వేరుగా, ప్రవేశాలను వేరుగా చూడరాదు. వేర్వేరు పరీక్షల వల్ల ఉమ్మడి ప్రవేశాలకు మెరిట్ జాబితా రూపొందించడం సాధ్యం కాదు. విద్యార్థులు రెండు పరీక్షలు రాయాల్సి వస్తుంది. వేర్వేరు పరీక్షలు ఈ సెక్షన్‌లోని నిబంధనలకు విరుద్ధం. ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిం చాలి. లేకపోతే విద్యార్థులు నష్టపోతారు. -
చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం
హైదరాబాద్: ప్రస్తుతం భరోసా యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతిని బయటపెడితే వారు జైలు భరో యాత్రలు చేయాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కె. జగదీశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే వారికి బంధించేందుకు తెలంగాణలో జైళ్లు కూడా సరిపోవని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు తెలంగాణ మంత్రులు సిద్ధంగా ఉన్నారని జగదీశ్వరరెడ్డి వెల్లడించారు. విద్యుత్ విషయంలో చట్టాలను అమలు చేయమని ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తే మా చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగిస్తామని జగదీశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నారు. భరోసా యాత్రలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
''తెలంగాణ విద్యార్ధులకు మాత్రమే రీయింబర్స్మెంట్''
-
చంద్రబాబు వాదన వింతగా ఉంది: జగదీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గత ప్రభుత్వాల సాంప్రదాయాలను మా ప్రభుత్వం పాటించదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించిన పాత బకాయిలను తాము చెల్లించమని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్ధుల ఫీజులతో మాకు సంబంధం లేదు అని జగదీశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1956కు ముందు తెలంగాణ వారై ఉండాలన్నది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక ప్రాతిపదిక మాత్రమే అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలన్న చంద్రబాబు వాదన వింతగా ఉందని జగదీశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.