
ఏపీ చీఫ్ ఇంజనీర్ ఇళ్లపై ఏసీబీ దాడులు
ఏపీకి చెందిన మరో ఉన్నతాధికారి ఏసీబీ అధికారుల వలలో చిక‍్కారు
హైదరాబాద్: ఏపీకి చెందిన మరో ఉన్నతాధికారి ఏసీబీ అధికారుల వలలో చిక‍్కారు. చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్‌రెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
గత కొంతకాలంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్‌రెడ్డి ఇళ్లలో సోమవారం ఉదయం నుంచి ఏసీపీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు సూర్యాపేట, మహబూబ్‌నగర్, విజయవాడ, చెన్నై సహా పన్నెండు ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో సుమారు 16 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి 100 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.