
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది.
దీంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.
తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్‌లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు.
స్పీకర్ గురించి జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారంటే?
తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు.

Comments
Please login to add a commentAdd a comment