చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం
హైదరాబాద్: ప్రస్తుతం భరోసా యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతిని బయటపెడితే వారు జైలు భరో యాత్రలు చేయాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కె. జగదీశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే వారికి బంధించేందుకు తెలంగాణలో జైళ్లు కూడా సరిపోవని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు తెలంగాణ మంత్రులు సిద్ధంగా ఉన్నారని జగదీశ్వరరెడ్డి వెల్లడించారు.
విద్యుత్ విషయంలో చట్టాలను అమలు చేయమని ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తే మా చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగిస్తామని జగదీశ్వర్రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నారు. భరోసా యాత్రలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.