ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గత ప్రభుత్వాల సాంప్రదాయాలను మా ప్రభుత్వం పాటించదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్ కు సంబంధించిన పాత బకాయిలను తాము చెల్లించమని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్ధుల ఫీజులతో మాకు సంబంధం లేదు అని జగదీశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1956కు ముందు తెలంగాణ వారై ఉండాలన్నది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక ప్రాతిపదిక మాత్రమే అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్న చంద్రబాబు వాదన వింతగా ఉందని జగదీశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.