రంగారెడ్డి జిల్లా : ‘మా రాష్ట్రానికి బదిలీ చేయండి.. వెంటనే వెళ్ళిపోతాం.’ అంటూ తెలంగాణలో పనిచేస్తున్న 148 మంది ఆంధ్ర ప్రాంత టీచర్ల వేడుకుంటున్నా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిపోవ డంతో.. గతంలో ఉన్న విద్యాశాఖ నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో అంతర్ జిల్లా బదిలీ ప్రక్రియతో సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉండేది.
కానీ ప్రస్తుతం రాష్ట్రం విడిపోవడంతో.. ఓపెన్ కేటగిరీలో జిల్లాలో నియమితులైన పలువురు టీచర్లు ఇక్కడే పనిచేస్తున్న టీచర్లు సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశం లేదు. గతవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని రెండుదఫాలుగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. అయినా కానీ ఈ విషయంపై స్పష్టత రాలేదు.
బదిలీ చేయండి.. వెళ్లిపోతాం
Published Sun, Apr 19 2015 8:24 PM | Last Updated on Sat, Aug 18 2018 4:23 PM
Advertisement