2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్‌ | PM Narendra Modi to commission IAC Vikrant at Cochin Shipyard on 2 sept 2022 | Sakshi
Sakshi News home page

2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్‌

Published Tue, Aug 23 2022 6:39 AM | Last Updated on Tue, Aug 23 2022 6:39 AM

PM Narendra Modi to commission IAC Vikrant at Cochin Shipyard on 2 sept 2022 - Sakshi

కొచ్చి: మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్‌ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్‌ఎల్‌ నేవీకి అప్పగించిన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement