iac vikranth
-
2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్
కొచ్చి: మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్(సీఎస్ఎల్)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్ఎల్ నేవీకి అప్పగించిన విషయం తెలిసిందే. -
ఐఏసీ విక్రాంత్ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మించిన యుద్ధవిమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్ మరో దఫా జల పరీక్షలు ఆదివారం ఆరంభమయ్యాయి. రూ.23వేల కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నౌకను వచ్చే ఆగస్టులో దీన్ని నేవీకి అందిస్తారు. అందుకే ఈ లోపు వివిధ దఫాలుగా వివిధ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఆగస్టులో, అక్టోబర్‌లో సముద్రంలో ట్రయిల్స్ నిర్వహించారు. చదవండి: మీసాలపై తగ్గేదేలే... తీయననంటే తీయను తాజాగా మరోమారు సీ ట్రయిల్స్ ఆరంభిస్తున్నామని, స్వేచ్ఛాజలాల్లో(హై సీస్) పలు రకాల నౌకా విన్యాసాలు నిర్వహిస్తామని నేవీ ప్రతినిధి వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకకున్న సెన్సార్ సూట్లను కూడా పరీక్షిస్తామన్నారు. డీఆర్డీఓకి చెందిన ఎన్ఎస్టీఎల్ సైంటిస్టులు తాజా పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఈ నౌక నుంచి ఎంఐజీ జెట్లు, కమోవ్ హెలిక్యాప్టర్లును ప్రయోగించవచ్చు. దీని గరిష్ట వేగం 28 నాట్స్. #WATCH | Indigenous Aircraft Carrier INS Vikrant heads out for the next set of sea trials. pic.twitter.com/S1Yt8crcqu — ANI (@ANI) January 9, 2022 కొచ్చిన్ షిప్‌యార్డ్ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే యుద్ధ నౌక ఉంది. విక్రాంత్ నిర్మాణంతో సొంతంగా తయారు చేసుకున్న యుద్ధనౌకలున్న దేశాల జాబితాలోకి భారత్ చేరింది. కరోనా కారణంగా విక్రాంత్ పరీక్షల్లో జాప్యం జరిగింది. వీలైనంత త్వరగా ట్రయిల్స్ పూర్తిచేసి, సకాలంలో నౌకను నావికా దళంలో చేర్చేందుకు పలు సంస్థలకు చెందిన పలువురు నిపుణులు సంయుక్తంగా శ్రమిస్తున్నారని వివేక్ తెలిపారు. -
‘విక్రాంత్’ వచ్చేస్తోంది
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకొని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక యుద్ధ నౌకల విషయంలో వెనకబడి ఉందన్న గీతని చెరిపేసేలా ఐఏసీ విక్రాంత్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌక డిజైన్ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్ ట్రయల్స్ పూర్తి చేశారు. తొలిసారిగా సముద్ర విహారం ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్ సీట్రయల్ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. చరిత్రాత్మక ఘటనగా భారత నావికాదళం అభివర్ణన న్యూఢిల్లీ: భారత్‌లో నిర్మించిన తొలి యుద్దవిమాన వాహక నౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్–ఐఏసీ) విక్రాంత్.. సామర్థ్య పరీక్షలు మొదలయ్యాయి. సముద్రంలో ఐఏసీ విక్రాంత్ ట్రయల్స్ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ బుధవారం వ్యాఖ్యానించింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది. భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మథ్వాల్ చెప్పారు. యుద్ధవిమానాల మోహరింపులో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే అవసరాలను తీరుస్తోంది. కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్ రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
తేజస్ జెట్లను వినియోగించలేం: నేవీ
న్యూఢిల్లీ: దేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్ కు సేవలను అందుకోగల సామర్ధ్యం భారత విమానవాహక నౌకలకు లేదని భారతీయ నేవీ పేర్కొంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, అడ్మిరల్ సునీల్ లాన్బా ఓ ప్రకటన విడుదల చేశారు. తేజస్ అధిక బరువు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అధిక బరువు కలిగిన జెట్లను విమానవాహక నౌకలపై వినియోగించడం అసాధ్యమని చెప్పారు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ నేవీకి ఉపయోగపడుతుందని తాము భావించామని చెప్పారు. దురదృష్టవశాత్తూ తేజస్ జెట్ల అధిక బరువు విమానవాహక నౌక సామర్ధ్యానికి కంటే ఎక్కువ ఉందని చెప్పారు. ప్రస్తుతం మిగ్-29కే జెట్లను విమానవాహక నౌక విక్రమాదిత్యపై వినియోగిస్తున్నామని, తర్వలో దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్ మీద కూడా మిగ్-29కేలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. నేవీ వద్ద ఉన్న విమానవాహక నౌకల సామర్ధ్యానికి తగిన విధంగా ఉండే సరికొత్త జెట్ల కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు చెప్పారు. తేజస్ జెట్లకు సరిపడే విమానవాహక నౌక అవసరం నేవీకి ఉందని లాన్బా అన్నారు. నేవల్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీవోను నేవీ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కాగా, తేజస్ ను భారతీయ వాయుదళంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి కొనుగోలు చేసిన విమానవాహక నౌకల సామర్ధ్యానికి.. మనం సొంతగా తయారుచేసే జెట్లు సరితూగకపోతే కాలానుగుణంగా టెక్నాలజీలో వచ్చిన మార్పులు అందుకు కారణంగా భావించవచ్చు. దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్(విమానవాహక నౌక)పై కూడా తేజస్ ను వినియోగించలేమని నేవీ చెప్పడం దూరదృష్టి లేకుండానే దేశీయ జెట్లు, విమానవాహక నౌకలను తయారు చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మిగ్ విమానాలకు ప్రత్యామ్నాయంగా ఓ ఫైటర్ డెవలప్ మెంట్ ను చేయాలని 1980ల్లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1999లో విక్రాంత్ ను అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది.