
రజనీకాంత్ కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ చిత్రాల్లో ‘బాషా’ ఒకటి. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ముంబైలో ‘మాణిక్ బాషా’గా కనిపించారు రజనీకాంత్. బాషా భాయ్‌గా రజనీ నటన, స్టయిల్‌ని మరచిపొలేం. ఇప్పుడు మొయుద్దీన్ భాయ్‌గా రజనీ కనిపించనున్న చిత్రం ‘లాల్ సలామ్’. ముంబై బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ చిత్రాన్ని రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ చేస్తున్న మొయుద్దీన్ భాయ్ పాత్ర కీలకం. ‘అందరి ఫేవరెట్ అయిన భాయ్ మళ్లీ ముంబైలో అడుగుపెట్టారు’ అంటూ ఆయన లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రజనీకాంత్ రాకింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: విష్ణు రామస్వామి.