‘ముద్దుగా’ నచ్చుతుంది
‘ముద్దుగా’ నచ్చుతుంది
Published Tue, Jan 7 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
‘‘ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే క్యూట్ లవ్‌స్టోరీ ఇది. టీమ్‌లో ప్రతి ఒక్కరూ కష్టపడి, ఇష్టపడి పనిచేశారు. టైటిల్‌కి తగ్గట్టుగానే అందరికీ ముద్దుగా నచ్చుతుంది’’ అని దర్శకుడు సతీష్ కుమార్ చెప్పారు. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా సీవీ రెడ్డి సమర్పణలో రూపొందిన ‘ముద్దుగా’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. హీరో ఆది పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని డా.కాసు ప్రసాద్‌రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ -‘‘ఈ చిత్ర దర్శకుడు నాకు అన్నయ్య. చిన్నప్పటి నుంచీ తన విషయంలో ప్రతీదీ సర్‌ఫ్రై జే. ఏదైనా చిన్నగా అంచనా వేస్తే, అది చాలా పెద్దదవుతుంది. ఈ చిన్న సినిమా కూడా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆర్పీ పట్నాయక్, టి.ప్రసన్నకుమార్ ఆకాంక్షించారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు మధు పొన్నాస్, దామోదర్ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, జగన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement