ఒక రాత్రి... నాలుగు కథలు! | Vikrant Massey Turns 34, Reveals First Look Of Mumbaikar | Sakshi
Sakshi News home page

ఒక రాత్రి... నాలుగు కథలు!

Apr 3 2021 10:51 PM | Updated on Apr 3 2021 10:51 PM

Vikrant Massey Turns 34, Reveals First Look Of Mumbaikar - Sakshi

ముంబైకర్‌ ఫస్ట్‌ లుక్‌ 

ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి హిందీలో నటిస్తున్న తొలి చిత్రం ‘ముంబైకర్‌’. ప్రముఖ కెమెరామ్యాన్‌ సంతోష్‌ శివన్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇందులో విక్రాంత్‌ మెస్సీ, తాన్య, సంజయ్‌ మిశ్రా, రణ్‌వీర్‌ షోరే, సచిన్ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రాంత్‌ మెస్సీ పుట్టినరోజు సందర్భంగా ‘ముంబైకర్‌’ ఫస్ట్‌ లుక్‌ను విజయ్‌సేతుపతి షేర్‌ చేశారు. తమిళ హిట్‌ మూవీ ‘మా నగరం’కి హిందీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బతుకుతెరువు కోసం ముంబయ్‌ వచ్చిన నలుగురు వ్యక్తుల నేపథ్యంలో ఒక రాత్రి జరిగే నాటకీయ పరిణామాల సమాహారంగా ‘ముంబైకర్‌’ సినిమా రూపొందుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement