లాల్ సలామ్ చిత్రం రజనీకాంత్ సినిమా కెరియర్‌లోనే బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో ఆయన నటించింది ప్రత్యేక పాత్ర అయినప్పటికీ సినిమాకు హైప్ వచ్చిందే ఆయన వల్ల. జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో 'లాల్ సలామ్' చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. ఇక తెలుగు, కన్నడలో అయితే చెప్పాల్సిన పనిలేదు.
చాలా చోట్ల ప్రేక్షకుల లేకపోవడంతో ఈ సినిమాను తీసేసి వేరే చిత్రాన్ని తీసుకున్నారు. జైలర్ చిత్రానికి మొదటి వారంలో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లు గ్రాస్ వచ్చింది. ఫైనల్‌గా రూ. 650 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు లాల్ సలామ్ విషయంలో తెడా కొట్టేసింది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 27 కోట్లు రాబట్టింది. నెట్ పరంగా చూస్తే కేవలం రూ. 15 కోట్లు మాత్రమే. దీంతో ఈ సినిమా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. రజనీ ఇమేజ్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది.
ఓవర్సీస్‌లో ఈ సినిమా రూ. 4 కోట్లు రాబడితే తమిళనాడులో రూ. 19 కోట్లు సాధించింది. తెలుగులో మాత్రం కేవలం రూ. 2 కోట్లకే పరిమితం అయింది. కన్నడలో కూడా రూ. 2 కోట్లతోనే ముగింపు పలికింది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో ఒక పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిపోనుంది.
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీనికి సంగీతం భారతదేశంలో అగ్ర సంగీత దర్శకుడు అయిన ఏఆర్ రహమాన్ అవటం ఇంకో విశేషం. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ రెండు ముఖ్య పాత్రలు పోషించారు. జీవితా రాజశేఖర్ కూడా ఇందులో కొంత సమయం పాటు కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment