ఆ హీరో చేతికి రజనీకాంత్ 'లాల్ సలామ్' మూవీ | Rajinikanth Lal Salaam Movie Rights Taken Red Giant Movies | Sakshi
Sakshi News home page

Lal Salaam Movie: ఆ హీరో చేతికి రజనీకాంత్ 'లాల్ సలామ్' మూవీ

Published Sun, Oct 15 2023 5:38 PM | Last Updated on Sun, Oct 15 2023 5:57 PM

Rajinikanth Lal Salaam Movie Rights Taken Red Giant Movies - Sakshi

'జైలర్' లాంటి హిట్ తర్వాత రజనీకాంత్‌ నటించిన సినిమా 'లాల్‌ సలామ్‌'. ఇందులో ఆయన హీరో కాదు, మొయ్‌‌దీన్‌ బాయ్‌ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య.. ఈ మూవీకి డైరెక్టర్. విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. టీమిండియా దిగ్గజం కపిల్‌దేవ్‌ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశారు. 

(ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్)

క్రికెట్‌ నేపథ్య కథతో తీసిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నాడు.  షూటింగ్‌ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి బరిలోకి ఉన్న ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కుల్ని.. ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కి చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సొంతం చేసుకుంది. దీంతో లాల్‌సలామ్‌ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్‌లో ప్రమాదం.. ఆయన మృతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement