'గామి' సినిమా హిట్ కొట్టింది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.22 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి లాభాల్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ మూవీ కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. కానీ బుక్ మై షో వెబ్ సైట్‌లో మాత్రం రేటింగ్స్ విషయంలో చిన్నపాటి వివాదమే నడుస్తోంది. దీనిపై ఇప్పుడు స్వయంగా విశ్వక్ సేన్ పోస్ట్ పెట్టాడు. లీగల్ యాక్షన్ తీసుకుంటానని అన్నాడు.
ఏంటీ వివాదం?
ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన సినిమాలు హిట్, ఫ్లాప్ అనేది తెలుసుకోవడం కోసం చాలామంది బుక్ మై షోలో వచ్చే రేటింగ్స్ చూస్తున్నారు. అయితే కొన్ని మూవీస్ విషయంలో బాట్స్ (ఊరు పేరు లేని అకౌంట్స్) రేటింగ్ చాలా తక్కువగా ఇస్తున్నాయి. దీని వల్ల ఓవరాల్ రేటింగ్ చాలా తగ్గిపోతుంది. సంక్రాంతికి 'గుంటూరు కారం' చిత్రానికి కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు 'గామి' విషయంలో అదే రిపీటైంది.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?)
విశ్వక్ ఏం అన్నాడు?
'గామి సినిమాను ఇంతలా హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. అయితే దీని రేటింగ్ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. కొందరు కావాలనే 10కి 1 రేటింగ్ ఇస్తున్నారు. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్ 1కి పడిపోయింది. మీరు ఎన్నిసార్లు లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తాను. ఇలాంటి పనులు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలీదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. 'గామి'ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు థ్యాంక్స్. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకెళ్తాను' అని విశ్వక్.. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
విశ్వక్ చెప్పిన దానిబట్టి చూస్తే రాబోయే కొత్త సినిమాలకు కూడా ఇలా రేటింగ్స్ తక్కువగా ఇవ్వడం జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయితే ఇదంతా ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో వెతికిపట్టుకుని, సమస్యని పరిష్కరించడం అయ్యే పనేనా అని కొందరు నెటిజన్స్ అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment