విశ్వక్ సేన్ ‘గామి’పై రాజమౌళి ప్రశంసలు | SS Rajamouli Interesting Comments On Vishwak Sen Gaami Movie, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

విశ్వక్ సేన్ ‘గామి’పై రాజమౌళి ప్రశంసలు

Published Wed, Mar 6 2024 4:53 PM | Last Updated on Wed, Mar 6 2024 5:14 PM

SS Rajamouli Comments On Gaami Movie - Sakshi

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు సినీ ప్రముఖులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇన్‌స్టా వేదికగా ‘గామి’ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.  ‍

(చదవండి: వారి కోసం చాలా మంచి పనులు చేశారు.. సీఎం జగన్‌పై హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ ప్రశంసలు)

‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అని తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. అంతకుముందు ప్రభాస్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ఇంకా పలువురు సెలబ్రిటీలు టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

(చదవండి: ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్‌)

గామి విషయానికొస్తే.. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ మూవీ ఇప్పుడు పెద్ద చిత్రంగా రిలీజ్‌ అవుతోంది. దాదాపు ఐదేళ్ల పాటు ఈ సినిమాని షూటింగ్‌ చేశారు. విశ్వక్‌ తన తొలి సినిమా రిలీజ్‌ కాకముందే ఈ కథను ఓకే చెప్పేశాడు. ఇందులో ఆయన అఘోరాగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార​్‌ బోర్డ్‌ ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికేట్‌ జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement