బ్లాక్‌బస్టర్‌ సినిమా 'గామి' ఓటీటీ వివరాలు ఇవే | Gaami Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బస్టర్‌ సినిమా 'గామి' ఓటీటీ వివరాలు ఇవే

Mar 9 2024 12:29 PM | Updated on Mar 9 2024 12:41 PM

Gaami Movie Ott Streaming Date - Sakshi

విశ్వక్‌ సేన్‌  హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సుమారు 30 రోజులు పట్టే అవకాశం ఉంది.

'గామి' ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు జీ5 నెట్‌వర్క్ వారు దక్కించుకున్నారు. ట్రైలర్‌తో అందరినీ మెప్పించిన 'గామి' రైట్స్‌ కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడినట్లు సమాచారం. వాటన్నింటిని దాటుకుని ఫైనల్‌గా భారీ వ్యయం వెచ్చించి 'గామి' హక్కులను జీ5 సొంతం చేసుకుందట. ఏప్రిల్‌ రెండో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. 

విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా నటించారు. క్రౌడ్‌ ఫండింగ్‌తో కార్తీక్‌ శబరీష్‌ 'గామి' చిత్రాన్ని నిర్మించారు. రొటీన్ మూస సినిమాల నడుమ ఓ కొత్తదనం, ప్రయోగం గామిలో కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్‌తోనే మనవాళ్లు ఇంతటి ప్రమాణాలతో సినిమాను చూపించగలరా అని ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. నిజానికి హీరో విశ్వక్‌ షేన్‌ను మెచ్చుకోవాలి.. 'గామి' సమయానికి ఆయన ఎవరో కూడా తెలియదు అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుని ఉంటాడు.. ఇప్పుడైతే ఈ భిన్నమైన పాత్రను అంగీకరించేవాడో కాదో తెలియదు. ఏదేమైనా శభాస్‌ విశ్వక్‌ అంటూ సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement