‘గామి’ విడుదలే మాకు పెద్ద విజయం: నిర్మాత | Karthik Sabareesh Talk About Gaami Movie | Sakshi
Sakshi News home page

‘గామి’సక్సెస్‌తో ఆ నమ్మకం వచ్చింది: నిర్మాత

Published Tue, Mar 12 2024 1:52 PM | Last Updated on Tue, Mar 12 2024 2:52 PM

Karthik Sabareesh Talk About Gaami Movie - Sakshi

‘మా లాంటి కొత్త వారికి సినిమా చేసిన తర్వాత అది విడుదల చేయడమే పెద్ద విజయం. లాంటింది 'గామి'కి అన్ని చోట్లా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కడం చాలా బలాన్ని ఇచ్చింది. సినిమా విజయం సాధించడంతో ప్రశంసలు దక్కడం మరిన్ని మంచి చిత్రాలు చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చింది’అన్నారు నిర్మాత కార్తిక్‌ శబరీష్‌. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్ర మర్చి 8న విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కార్తీక్‌ శబరీష్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

అలా గామి మొదలైంది
నేను తమాడ మీడియంలో షో ప్రొడ్యుసర్ గా షార్ట్ ఫిలిమ్స్ కి పని చేసేవాడిని. అక్కడ చాలా మంది ఎన్ఆర్ఐ లు తమ పేరు చూసుకోవాలనే ఇష్టంతో షార్ట్ ఫిల్మ్స్ ని నిర్మించేవారు. ఇలాంటి వారందరిని ఒక్క చోటికి చేర్చి ఒక సినిమా తీస్తే బావుటుందనే ఆలోచన వచ్చింది. ‘మను’ అలా చేసిన చిత్రమే. గామి చిత్రానికి కూడ అదే స్ఫూర్తి. అంతకుముందు దర్శకుడు విద్యాధర్ తో షార్ట్ ఫిలిమ్స్ చేశా. తనతో మంచి అనుబంధం ఉండేది. కలసి 'గామి' సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ జర్నీ మొదలైయింది.

 వీఎఫ్ఎక్స్‌పై దర్శకుడికి మంచి పట్టు ఉంది
దర్శకుడు  విద్యాధర్  వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తనకి  వీఎఫ్ఎక్స్ పై మంచి పట్టు ఉంది. గామిలో చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. దాని వీలైనంత వరకూ మన పరిధిలో ఎలా చేయగలమని అలోచించాం. ప్రత్యేకంగా సింహం సీక్వెన్స్ ని వారితో చేయించుకొని దానికి అదనంగా వాడాల్సిన హంగులని మన టీంతో చేయించుకునేలా ప్లాన్ చేసుకున్నాం. దాని కారణంగా దాదాపు వారి ఇచ్చిన కొటేషన్ కి 40శాతం తగ్గించగలిగాం. సినిమాని ఫలానా సమయానికి విడుదల చేసేయాలనే ఒత్తిడి లేదు కాబట్టి కావాల్సిన సమయాన్ని వెచ్చించి మంచి అవుట్ పుట్ ని తీసుకురాగలిగాం.

 నాగ్ అశ్విన్ సహాయం మరువలేనిది
 క్రౌడ్ ఫండ్‌తో ఈ సినిమాను నిర్మించాలి భావించి..అనౌన్స్‌ చేశాం. కానీ దాని ద్వారా మాకు తక్కువ ఫండ్‌ వచ్చింది. అయితే  ప్రాజెక్ట్ కి కావాల్సిన మొత్తం ఫండ్ ఉన్నపుడే మొదలుపెట్టాలని భావిస్తే అది జరగదు. ముందు దూకేయాలనే ఓ ధైర్యంతో నెల్లూరు లో మొదటి షెడ్యుల్ స్టార్ట్ చేశాం. నెల్లూరు మా సొంత ఊరు కాబట్టి లోకేషన్స్ పర్మిషన్స్ సులువుగా దక్కాయి. మాకున్న బడ్జెట్ లో ఆ షెడ్యుల్ పూర్తి చేయగలిగాం. తర్వాత ఏమిటనేది సవాల్. ఈ సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ గారు మా వీడియో చూసి కాల్ చేశారు. మా ఆఫీస్ కి వచ్చి మా వర్క్ అంతా చూసి సినిమా గురించి బైట్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత జనాలు కొందరు పెట్టుబడి పెడతామని వచ్చారు. అసోషియేషన్స్ దొరికాయి. దాని తర్వాత వర్క్ ఇంకాస్త స్మూత్ గా జరిగింది. నాగ్‌ అశ్విన్‌ సహాయం మరువలేనిది

క్లైమాక్స్‌ బాగా నచ్చింది
గామిని ఓ రెండు సినిమాలతో పోల్చడం గమనించాను, నిజానికి ఆ సినిమాలు స్టార్ట్ కాకముందే 'గామి'ని మొదలుపెట్టాం. క్లైమాక్స్ లో వచ్చే యూనిక్ పాయింట్ చాలా బావుంది. దర్శకుడు చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. అది నచ్చే సినిమా చేయాలని నిర్ణయించాం. వి సెల్యులాయిడ్ వచ్చిన తర్వాత మేము సేఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. రాజీపడకుండా చేయొచ్చనే ధైర్యం వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement